
అందుబాటులో ఉండి దరఖాస్తులు స్వీకరించాలి
భూపాలపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల స్వీకరణకు 14వ తేదీ చివరి రోజు కావడంతో ఎక్కువ సంఖ్యలో దరఖాస్తుదారులు వచ్చే అవకాశం ఉన్నందున ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్ అందుబాటులో ఉండి దరఖాస్తులు స్వీకరించాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. 14వ తేదీ సెలవు అయినప్పటికీ రాజీవ్ యువ వికాసం పథకానికి చివరి తేదీ కావడంతో దరఖాస్తులు చేయడానికి పెద్దసంఖ్యలో దరఖాస్తుదారులు వచ్చే అవకాశం ఉన్నందున దరఖాస్తుల కొరత రాకుండా తగినన్ని అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఆఫ్‌లైన్‌లో వచ్చే దరఖాస్తుదారులకు దరఖాస్తు ముట్టినట్లు రశీదులు ఇవ్వాలని, వచ్చిన ప్రతీ దరఖాస్తు ఆన్‌లైన్ చేయడంతో పాటు జాగ్రత్తగా భద్రపరచాలని కలెక్టర్ ఆదేశించారు.
కలెక్టర్ రాహుల్ శర్మ