
శాంతి చర్చలు జరపాలి
భూపాలపల్లి రూరల్: మావోయిస్టులతో శాంతి చర్చలకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని మానవహక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శనిగరం తిరుపతయ్య విజ్ఞపి చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం, మావోయిస్టులు శాంతి చర్చలు జరుపుకోవాలని భేషరతుగా ఎదురు కాల్పులు విరమించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యావంతులు వేదిక, జిల్లా అధ్యక్షుడు రాదండి దేవేందర్, దుర్గా ప్రసాద్, కర్ణాటకపు సమ్మయ్య, మోటపలుకుల రమేష్, మారెపల్లి మల్లేష్, చంద్రగిరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
అంబేడ్కర్ కలలు సాకారం
భూపాలపల్లి రూరల్: భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఆశయాలను, కలలను బీజేపీ ప్రభుత్వం సాకారం చేస్తుందని ఆపార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయరామారావు అన్నారు. అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పుల్యాల రాజు ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం విజయరామారావు మాట్లాడుతూ అంబేడ్కర్‌ను అడుగడుగునా అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిశిధర్‌రెడ్డి, నాయకులు వెన్నంపల్లి పాపన్న, కన్నం యుగదీశ్వర్, లింగంపల్లి ప్రసాదరావు, బట్టు రవి, దుప్పటి భద్రయ్య, సయ్యద్ గాలిప్, దొంగల రాజేందర్, సామల మధుసూదన్ రెడ్డి, రఘునాథ్‌రెడ్డి పాల్గొన్నారు.
శ్రీపాదరావు
గొప్ప నాయకుడు
భూపాలపల్లి రూరల్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ శ్రీపాదరావు రాష్ట్రానికే గాక మంథిని నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేసిన గొప్ప నాయకుడు శ్రీపాదరావు అని టీపీసీసీ సభ్యుడు చల్లూరి మధు అన్నారు. శ్రీపాదరావు 26వ వర్ధంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీపాదరావు చేసిన సేవలను స్మరించుకున్నారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తండ్రికి తగ్గ తనయుడిగా తండ్రి పేరును నిలబెడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ముంజాల రవీందర్, మధుకర్‌రెడ్డి, తిరుపతి గౌడ్, ఐఎన్‌టీయూసీ నాయకులు పాల్గొన్నారు.
సరస్వతి పుష్కరాల
పనుల పరిశీలన
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 15నుంచి 26వరకు జరుగనున్న సరస్వతినది పుష్కరాల పనులను రాష్ట్ర దేవాదాయశాఖ ధార్మక సలహాదారు గోవిందహరి పరిశీలించారు. ఆదివారం ఆయన ముందుగా శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. ఆయనను ఈఓ మహేష్ శాలువాతో సన్మానించగా, అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం వీఐపీ (సరస్వతి) ఘాటు వద్ద నిర్మిస్తున్న పుష్కరఘాటు, సరస్వతి మాత విగ్రహం ఏర్పాటు పనులను ఆయన పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఆయన వెంట సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఉపప్రధాన అర్చకుడు ఫణీంద్రశర్మ ఉన్నారు.

శాంతి చర్చలు జరపాలి

శాంతి చర్చలు జరపాలి

శాంతి చర్చలు జరపాలి