
పుష్కరాల పనులు పూర్తిచేయాలి
కాళేశ్వరం: సరస్వతి పుష్కరాల అభివృద్ధి పనులు సకాలంలో పూర్తిచేయాలని కాటారం సబ్‌కలెక్టర్ మయాంక్‌సింగ్ అన్నారు. మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం ఈఓ కార్యాలయంలో గురువారం దేవాదాయ, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, వైద్యారోగ్యశాఖ, ఇరిగేషన్, విద్యుత్, సింగరేణి, ఆర్టీసీ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 15నుంచి 26వరకు కాళేశ్వరంలో జరుగనున్న సరస్వతి పుష్కరాలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. పుష్కరాల అభివృద్ధి పనులు వెంటనే పూర్తిచేయాలని సంఽబందితశాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం వీఐపీ ఘాటు, ప్రధానఘాటుల వద్ద శాశ్వత నిర్మాణాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ మహేష్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఈఈ, డీఈ, ఏఈఈలు పాల్గొన్నారు.
కాటారం సబ్‌కలెక్టర్ మయాంక్‌సింగ్