మూడో రోజూ నిరాశే.. | - | Sakshi
Sakshi News home page

మూడో రోజూ నిరాశే..

Published Tue, Feb 25 2025 1:22 AM | Last Updated on Tue, Feb 25 2025 1:19 AM

మూడో

మూడో రోజూ నిరాశే..

అచ్చంపేట: శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది ఆచూకీ సోమవారం మూడోరోజూ చిక్కలేదు. సహాయక బృందాలు షిఫ్ట్‌ల వారీగా టీబీఎం మిషన్‌ సమీపంలో వంద మీటర్ల దూరం వరకు వెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం లేకుండాపోతోంది. నీటి ఉధృతికి కాంక్రీట్‌ సెగ్మెంట్‌లు ఊడిపోయి అందులో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. సోమవారం నాటికి రాష్ట్ర విపత్తుతోపాటు ఆర్మీ, నేవీ, సింగరేణి, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, జేపీ, నవయుగలకు చెందిన బృందాలు ఇప్పటి వరకు ఏడు సార్లు టన్నెల్‌లోకి వెళ్లి గాలింపు చేపట్టారు. ఇందులో దాదాపు 584 మంది నిపుణులైన సిబ్బంది ఉన్నారు. ఉత్తరాఖండ్‌లో జరిగిన విపత్తులో ఈ బృందాలతో పాటు 14 మంది ర్యాట్‌ (ర్యాట్‌ హూల్‌ టీం) మైనర్స్‌, స్నిపర్‌ డాగ్స్‌ సైతం చేరుకున్నాయి. పెద్దఎత్తున బురద నీరు ఉండటంతో లోపలికి వెళ్లలేకపోయాయి. టన్నెల్‌ లోపలికి పైనుంచి రంద్రం చేసి వెళ్లాలన్న (వర్టికల్‌ డ్రిల్లింగ్‌) ప్రతిపాదనలు తోసిపుచ్చారు. ఐదు గ్యాస్‌ కట్టింగ్‌ మిషన్లతో పనిచేస్తున్నారు.

పై సెగ్మెంట్‌ బిగిస్తుండగా..

బోరింగ్‌ మిషన్‌(టీబీఎం) మీటరు దూరం సొరంగం తొలచిన తర్వాత మరో మిషన్‌ ద్వారా కాంక్రీట్‌ సెగ్మెంట్‌ బిగిస్తారు. 9 మీటర్ల వ్యాసంతో ఉండే ఈ సొరంగంలో మొత్తం 7 సెగ్మెంట్లు బోల్టుల ద్వారా బిగిస్తారు. చుట్టూ అటు ఇటు మూడు చొప్పున ఆరు సెగ్మెంట్లు బిగించి పై సెగ్మెంట్‌ బోల్టును బిగిస్తుండగా ఒక్కసారి వచ్చిన నీటి ఊటకు సెగ్మెంట్లు ఊడిపోయి ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ శిథిలాల కింద కార్మికులు చిక్కుకొని ఉంటారని తోటి కార్మికులు భావిస్తున్నారు. అయితే ఆ ప్రాంతంలో నీటి ఊట, రాళ్లు, బురద కూరుకుపోవడంతో ముందుకు వెళ్లలేని పరిస్థితి తలెత్తినట్లు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు పేర్కొంటున్నాయి.

సిగ్నల్స్‌ ఏర్పాటు ద్వారా..

సొరంగంలో విద్యుత్‌, సమాచార వ్యవస్థ వైర్లు, పరికరాలు దెబ్బతినడంతో సిగ్నల్స్‌ వ్యవస్థ రావడం లేదు. దట్టమైన అడవితో పాటు సొరంగం ప్రాంతంలో మొబైల్‌ సిగ్నల్స్‌ అందుబాటులో లేవు. ఈ దశలో ప్రభుత్వం సోమవారం హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్‌ అందుబాటులోకి తీసుకొచ్చి ప్రమాదం జరిగిన చోటకు పంపించారు. దీని ద్వారా అక్కడి పరిస్థితులను అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

టన్నెల్‌లో లభించని ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ

ముమ్మరంగా కొనసాగుతున్న గాలింపు చర్యలు

ఎస్‌ఎల్‌బీసీకి చేరుకున్నస్నిపర్‌ డాగ్స్‌, ర్యాట్‌ మైనర్స్‌ బృందాలు

వంద మీటర్ల దూరంలోనే ఆగిపోతున్న వైనం

పైనుంచి రంధ్రం చేసి వెళ్లాలన్న ప్రతిపాదన విరమణ

మంత్రులు, అధికారుల పర్యవేక్షణ

సొరంగం పనుల్లో చోటు చేసుకున్న సంఘటన జరిగిన నాటి నుంచి రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, ఎకై ్సజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రెండురోజుల పాటు ఇక్కడే ఉండి గాలింపు చర్యలను పర్యవేక్షించారు. సోమవారం రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, జయవీర్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, బాలునాయక్‌ ఎస్‌ఎల్‌బీసీ వద్దకు చేరుకున్నారు. అలాగే ఇరిగేషన్‌ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జ, హైడ్రా చీఫ్‌ సెక్రటరీ అర్వింద్‌, హైడ్రా కమిషనర్‌ రంగరాథ్‌, నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, ఎస్పీ వైభవ్‌ గైక్వాడ్‌ రఘునాథ్‌ పర్యవేక్షణ, భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
మూడో రోజూ నిరాశే.. 1
1/2

మూడో రోజూ నిరాశే..

మూడో రోజూ నిరాశే.. 2
2/2

మూడో రోజూ నిరాశే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement