ఇదిలాఉండగా, జిల్లాలో నకిలీ సర్టిఫికెట్‌తో ఏఈఓ ఉద్యోగం పొందిన కాట్రావత్ నరేష్‌తోపాటు మరో వ్యక్తిని ఈ నెల 22న అరెస్టు చేశామన్నారు. అనంతరం ప్రధాన సూత్రధారులను పట్టుకునేందుకు దర్యాప్తు వేగవంతం చేశామన్నారు. పట్టుబడిన ఇద్దరు ఇచ్చిన సమాచారం మేరకు గద్వాల పోలీసు బృందం రెండు రోజుల క్రితం మిర్యాలగూడకు చేరుకున్నారని తెలిపారు. ఈక్రమంలోనే 25వ తేదీన మిర్యాలగూడ పట్టణ శివారులో గుర్తు తెలియని వ్యక్తులకు నకిలీ సర్టిఫికెట్లు అందిస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు రెక్కీ నిర్వహించి బాలకృష్ణను అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుడి నుంచి మూడు నకిలీ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నుటు్‌ల్ వెల్లడించారు. ఈ కేసులో బాలకృష్ణ ఏ3గా ఉన్నాడని తెలిపారు. ఇతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి వివరాలు వెల్లడించారని, త్వరలో అతడిని అదుపులోకి తీసుకుంటామన్నారు. 12 మందికి నకిలీ సర్టిఫికెట్లు అందించాడని అతను నేరం అంగీకరించాడన్నారు. ఇప్పటివరకు ఆరుగురి నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నామని, త్వరలో మిగతా వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు విషయంలో సీరియస్‌గా ఉందని, పట్టుబడిన నిందితుడిని గద్వాల కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. కేసు విచారణలో సీఐ శ్రీను, ఎస్‌ఐ కళ్యాణ్‌కుమార్, సిబ్బంది చంద్రయ్య, ఇస్మాయేల్ కీలకంగా వ్యవహరించారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment