ప్రతి కొనుగోలుకు రశీదు తప్పనిసరి
అలంపూర్: వినియోగదారులు ప్రతి కొనుగోళుకు రశీదు తీసుకోవాలని జూనియర్ సివిల్ కోర్టు జడ్జి మిథున్‌తేజ అన్నారు. అలంపూర్‌లోని జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. వినియోగదారులు కొనుగోలుకు సంబంధించి రశీదు పొందడం వలన ఏవైనా సమస్యలు వచ్చినా, ఇబ్బందులు కలిగిన రశీదు ఆధారంగా న్యాయం పొందవచ్చని అన్నారు.సమావేశంలో అడ్వకేట్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కుమార్, న్యాయవాదులు శ్రీనివాసులు, నాగరాజు యాదవ్, వెంకటేష్, యాకోబు, నాగయ్య, తిరుమలేష్, కక్షిదారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment