బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా రామాంజనేయులు
గద్వాల: బీజేపీ జిల్లా నూతన అధ్యక్షుడిగా టి.రామాంజనేయులును నియమిస్తూ పార్టీ రాష్ట్ర ఎన్నికల కో–రిటర్నింగ్ అధికారి గీతామూర్తి సోమవారం ప్రకటన విడుదల చేశా రు. అలాగే, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా గద్వాల నియోజకవర్గం నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు బండల వెంకట్రాములు, అక్కల రమాసాయిబాబ, అలంపూర్ నియోజకవర్గం నుంచి కె.జయలక్ష్మీని నియమించారు.
అలివేలు మంగ హుండీ లెక్కింపు
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ అలివేలు మంగతాయారు హుండీ లెక్కింపు సోమవారం చేపట్టారు. ఈ ఏడాది అమ్మవారికి హుండీ ద్వారా రూ.9,73,440 ఆదాయం వచ్చింది. లెక్కింపులో ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి, పాలక మండలి సభ్యులు సుధా, అలివేలు మంగమ్మ, వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment