రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో అభివృద్ధికి నిధుల కేటాయింపులు జరగలేదు. ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రజా సంక్షేమమం విస్మరించింది. అన్ని వర్గాలకు బడ్జెట్‌లో అన్యాయం జరిగింది. రాష్ట్రంలో ఉన్న ఏకై క శక్తిపీఠమైన జోగుళాంబ క్షేత్ర అభివృద్ధికి బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించలేదు. రోడ్లు, తాగునీటికి, సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్‌లో నిధులు ఇవ్వలేదు. సరిహద్దులోని నియోజకవర్గాలకు వైద్య సేవల విషయమై బడ్జెట్‌లో ప్రస్తావించనేలేదు. ఆరు గ్యారంటీలకు, ఎన్నికల్లో ఇచ్చిన ఇతర హామీలకు నిధులకు మంగళం పాడారు. ప్రజలను మోసగించడానికి ప్రయత్నించినట్లు ఈ బడ్జెట్‌తో స్పష్టంగా తెలుస్తుంది.
– విజయుడు, ఎమ్మెల్యే, అలంపూర్