గద్వాల క్రైం: చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవాధికారి సంస్థ కార్యదర్శి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కవితాదేవి అన్నారు. శనివారం జిల్లా ఆస్పత్రిలో న్యాయపరమైన సమస్యలు, చట్టాలపై మాట్లాడారు. బుద్దిమాంద్యం గల వ్యక్తులు వివిధ దశలలో న్యాయపరమైన హక్కులను వినియోగించక లేకపోతున్నారని, ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి వైద్యుల నుంచి పూర్తి సహకారం ఉండాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జ్ వైద్యాధికారి సిద్దప్ప, ఇందిరా తదితరులు పాల్గొన్నారు.