
18వ శతాబ్దం నుంచి పంచాంగ శ్రవణం
గద్వాల: ఉగాది పండుగను.. పంచాంగ శ్రవణాన్ని దాదాపు నాలుగు తరాలుగా ఆ కుటుంబసభ్యులు వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. వారే.. గద్వాలకు చెందిన బోరవెల్లి కుటుంబసభ్యులు. జిల్లా కేంద్రంలోని సంతాన వేణుగోపాలస్వామి ఆలయాన్ని 18వ శతాబ్దంలో భీమ్‌రెడ్డి, నాంచారమ్మ దంపతులు నిర్మించారు. భీమ్‌రెడ్డి సోదరుడైన రామన్న గద్వాల సంస్థానానికి దత్తతగా వెళ్లి రాంభూపాలుడు–2 పేరుతో మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. అక్కడి నుంచి ప్రతి ఉగాది పండుగ సాయంత్రం సంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో పంచాంగ శ్రవణం వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఆలయానికి బోరవెల్లి కేశవాచార్యులు నుంచి మొదలై 19వ శతాబ్దంలో వారి కుమారుడు బోరవెల్లి ప్రకాశమాచార్యులు, వారి కుమారులు బోరవెల్లి రాఘవాచార్యులు, మరియు బోరవెల్లి పవన్‌కుమార్ సంప్రదాయాన్ని అలాగే కొనసాగిస్తూ భక్తులకు పంచాంగ శ్రవణం చేస్తూ వస్తున్నారు.