
లైంగిక దాడులపై ధైర్యంగా ఫిర్యాదు చేయాలి
గద్వాల క్రైం: లైంగిక దాడుల విషయంలో ఎవరూ అధైర్యపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించి మాట్లాడారు. మహిళల హక్కులను గుర్తించి మహిళా సమానత్వం, సాధికారత, సామాజిక మార్పుతోనే సమ్యలపై విజయం సాధిస్తుందన్నారు. ఇంటా, బైటా మహిళలు ఎదుర్కొనే సమస్యలు, మహిళల హక్కులు, లైంగిక దోపిడీలాంటి సమస్యల వలయంలో ఎందరో మహిళలు ఉన్నారన్నారు. ఇలాంటి వాటిపై ప్రతి ఒక్కరు చైతన్యం కావాల్సిందిగా పిలుపునిచ్చారు. సామాజిక మార్పులతో ప్రతి క్షణం లింగ వివక్ష లేకుండా అందరు సమానమేనని గుర్తించాలన్నారు. మహిళల రక్షణ కోసం షీ టీం, భరోసా సభ్యులు ఇప్పటికే పలువురి పై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. బాధింపడ్డ మహిళలు, విద్యార్థినుల కోసం భరోసా కేంద్ర సిబ్బంది అందుబాటులో ఉన్నారని, వివిధ స్వచ్ఛంద సంస్థలు, ఆయా శాఖల సిబ్భంది సమన్వయంతో సహాయ సహకరాలు అందించాలన్నారు. మైనర్లపై జరిగిన దాడుల విషయంలో నిందితులకు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు మొగిలయ్య, శ్రీధర్‌బాబు, సీఐలు శ్రీను, టాటాబాబు, రవిబాబు, ఏపీపీ రేచల్ సంజనజాషువ, షీ టీం ఎస్‌ఐ రజిత, ఎస్‌ఐలు కళ్యాణ్‌కుమార్, శ్రీకాంత్, భరోసా, డీడబ్లూఓ, సీడబ్లూసీ సిబ్బంది శివాని, సునంద, స్వాతి, సహాదేవుడు, శిరిష తదితరులు ఉన్నారు.