
వైఎస్సార్ సీపీ పటిష్టతకు కృషి
తుని రూరల్: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా అధ్యక్ష పదవి అప్పగించడంతో తనపై బాధ్యత మరింత పెరిగిందని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. తుని మండలం ఎస్.అన్నవరంలోని కార్యాలయంలో ఆయనకు జిల్లావ్యాప్తంగా గురువారం వచ్చిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ, క్షేత్ర స్థాయిలో పార్టీ పటిష్టతకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. వైఎస్సార్ సీపీ రానున్న కాలంలో మళ్లీ అధికారం చేపడుతుందన్నారు. పార్టీ కోసం కష్టపడిన నాయకులకు, కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. కార్యకర్తలే తనకు కొండంత బలమని చెప్పారు. తుని, కోటనందూరు, తొండంగి మండలాలకు కొత్తగా నియమితులైన మండల అధ్యక్షులను రాజా సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ మేరుగు పద్మలత, రాష్ట్ర మాల కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెదపాటి అమ్మాజీ, వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కొప్పన శివ, సామర్లకోట మున్సిపల్ చైర్మన్ దొరబాబు, నాయకులు యనమల కృష్ణుడు, వాసిరెడ్డి జమీలు, సకురు నాగేంద్ర నెహ్రూ, నాగం దొరబాబు, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు ఏలూరి బాలు, ఎంపీపీ, వైస్ ఎంపీపీలు, వైస్ చైర్మన్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు రాజాకు శుభాకాంక్షలు తెలిపారు. మూడు మండలాలు, పట్టణం నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment