
నేడు నిర్లక్ష్యపు చీకట్లు
గత ప్రభుత్వ హయాంలో అన్ని సేవల్లోనూ ఓ వెలుగు వెలిగిన ఈ సీహెచ్‌సీపై ప్రస్తుతం నిర్లక్ష్యపు చీకట్లు అలముకుంటున్నాయి. ప్రభుత్వ దవాఖానాకు నేను రాను బాబోయ్ అనే దుస్థితిని మళ్లీ రప్పించారు నేటి పాలకులు. ఫలితంగా పిఠాపురం సీహెచ్‌సీ వైద్య సేవల్లో నానాటికీ దిగజారుతోంది. నేడు సిబ్బంది దండిగా ఉన్నారు. గతంతో పోలిస్తే సౌకర్యాలు కూడా గణనీయంగా పెరిగాయి. అయినప్పటికీ గత ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకూ అవుట్ పేషెంట్లు, ఇన్ పేషెంట్లు, సాధారణ డెలివరీలు, సిజేరియన్లు, కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్సలు, ఎక్స్‌రేలు, లేబొరేటరీ పరీక్షలు.. ఇలా అన్నిటిలోనూ ఈ సీహెచ్‌సీ అధోగతికి దిగజారిందని.. ఏ సేవలోనూ 50 శాతం కూడా దాటలేదని అధికారిక లెక్కలే చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment