
లక్ష్మీనరసింహస్వామి ఆదాయం రూ.47,89,784
సఖినేటిపల్లి: అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారికి భక్తుల నుంచి విరాళాల రూపంలో వివిధ హుండీల ద్వారా మొత్తం రూ.47,89,784 ఆదా యం చేకూరింది. గత నెల 27 నుంచి ఈ నెల 14వ తేదీ వరకూ 17 రోజులకు హుండీల ఆదాయాన్ని లెక్కించారు. అంతర్వేది ఆలయంలో దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డీఎల్‌వీ రమేష్‌బాబు, అమలాపురం ఎండోమెంట్స్ ఇన్‌స్పెక్టర్ జె.రామలింగేశ్వరరావు సమక్షంలో శుక్రవారం హుండీలు తెరచి లెక్కించగా స్వామివారికి పై ఆదాయం వచ్చింది. మెయిన్ హుండీల ద్వారా రూ.46,76,268, గుర్రాలక్క అమ్మవారి ఆలయ హుండీ ద్వారా రూ.86,241, అన్నదానం హుండీల ద్వారా రూ.27,275 వచ్చినట్టు దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ తెలిపారు. 8.500 గ్రాముల బంగారం, 104.370 గ్రాముల వెండి వస్తువులు కూడా వచ్చినట్టు చెప్పారు. లక్ష్మీనృసింహుని దేవస్థానానికి అనుబంధంగా ఉన్న నీలకంఠేశ్వరస్వామి ఆలయ హుండీ ద్వారా రూ.47,587 ఆదాయం వచ్చిందన్నారు. చైర్మన్, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ రాజా కలిదిండి కుమారరామ గోపాలరాజా బహద్దూర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ కాలేజీల్లో
విద్యార్థులు పెరగాలి
అమలాపురం టౌన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్యను మరింత పెంచాలని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పెరుగుదల కనిపించాలని ఇంటర్మీడియెట్ విద్య రీజినల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్‌జేడీ) ఐ.శారద సూచించారు. అమలాపురం ప్రభుత్వ బాలికల జూని యర్ కళాశాలను ఆమె శుక్రవారం సందర్శించి, ప్రభుత్వ కళాశాలల్లో బాలిక విద్య ఆవశ్యకత గురించి వివరించారు. జిల్లా ఇంటర్మీడియెట్ విద్య అధికారి (డీఐఈవో) వనుము సోమశేఖరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో శారద ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలు తక్కువేనని చెబుతూ పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థినినీ ప్రభుత్వ కళాశాలల్లో చేర్చేందుకు తల్లిదండ్రులు ముందుకు రావాలని పేర్కొన్నారు. డీఐఈవో సోమశేఖరరావు మాట్లాడుతూ విద్యార్థినులను ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేర్పించేందుకు జిల్లాలోని ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు ముందే రూపొందించుకున్న ప్రత్యేక ప్రణాళిక ప్రకారం తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తున్నారని, అవసరమైతే ఇళ్లకు వెళ్లి కౌన్సెలింగ్ ఇస్తున్నారని ఆర్‌జేడీకి వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ డి.కృష్ణకిషోర్, సీనియర్ అధ్యాపకురాలు కడియం శిరీష, కొత్తపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వై.లక్ష్మణరావు పాల్గొన్నారు.
కూటమి అభ్యర్థిని అనర్హుడిగా
ప్రకటించాలి
రాజమహేంద్రవరం సిటీ: శా సన మండలి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి జరుగుతు న్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరాన్ని అనర్హుడిగా ప్రకటించాలని స్వతంత్ర అభ్యర్థి జీవీ సుందర్ ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేశారు. స్థానిక రాజీవ్‌గాంధీ కళాశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటర్లను తరలించేందుకు కూటమి అభ్యర్థి టికెట్లు ఇస్తున్నారని, దీనిపై సీఈఓకు మెయిల్ పంపానని చెప్పారు. రిటర్నింగ్ అధికారి వెంటనే స్పందించి పేరాబత్తుల రాజశేఖరాన్ని డిస్‌క్వాలిఫై చేసి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థి జాబితాలో నంబర్ కేటాయింపుపై కూడా పలు సందేహాలున్నాయన్నారు. అక్షరక్రమంలో ిపీడీఎఫ్ అభ్యర్థి వీర రాఘవులుకు, స్వతంత్ర అభ్యర్థినైన తనకు ఏ ప్రాతిపదికన నంబర్లు ఇచ్చారో అనుమానాలున్నాయని చెప్పారు. క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా ఓటర్లను ఏవిధంగా మభ్యపెడుతున్నారో సుందర్ లైవ్‌లో వివరించారు. కూటమి అభ్యర్థి ఓటర్ స్లిప్పులలో ఫోన్ నంబర్లు, అడ్రస్, జియో లొకేషన్ కూడా ఉన్నాయని ఆరోపించారు. దీనిపై ఈ నెల 9న విజ్ఞాపన ఇచ్చానని, 12న సీఈఓకు మెయిల్ పంపానని చెప్పారు. రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయడానికి గురువారం వెళ్లానని, ఆయన లేకపోవడంతో డీఆర్‌ఓకు ఫిర్యాదు చేశానని తెలిపారు.

లక్ష్మీనరసింహస్వామి ఆదాయం రూ.47,89,784

లక్ష్మీనరసింహస్వామి ఆదాయం రూ.47,89,784
Comments
Please login to add a commentAdd a comment