ఉత్సాహంగా హాకీ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ జిల్లా క్రీడామైదానంలో జరుగుతున్న సివిల్ సర్వీసెస్ ఆల్‌ఇండియా హాకీ పోటీలు ఆదివారం రెండో రోజు ఉత్సాహంగా జరిగాయి. ఆర్‌ఎస్‌బీ (హైదరాబాద్), ఆర్‌ఎస్‌బీ (కొచ్చి) మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్‌ఎస్‌బీ హైదరాబాద్ జట్టు 8–1 స్కోర్ తేడాతోను, ఆర్‌ఎస్‌బీ(చంఢీఘర్), ఆర్‌ఎస్‌బీ (ముంబయి) మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్‌ఎస్‌బీ ముంబయి 5–1 స్కోర్ తేడాతోను, ఆర్‌ఎస్‌బీ (సిమ్లా), ఆర్‌ఎస్‌బీ (రాయ్‌పూర్) మధ్య నిర్వహించిన మ్యాచ్‌లో ఆర్‌ఎస్‌బీ రాయ్‌పూర్ 6–2 స్కోర్ తేడాతో విజయం సాధించాయి. ఛత్తీస్‌గఢ్ సెక్టార్, గుజరాత్ సెక్టార్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఛత్తీస్‌గఢ్ సెక్టార్ 13–0 స్కోర్‌తో గెలుపొందింది. మధ్యప్రదేశ్, తెలంగాణ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ 4–3 స్కోర్ తేడాతోను, కేరళ సచివాలయం, ఢిల్లీ సచివాలయం జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు 9–0 స్కోర్‌తోను, పాండిచ్చేరి , ఒడిశా సచివాలయాల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒడిశా జట్టు 6–0 స్కోర్‌తోను, గోవా , మహారాష్ట్ర సచివాలయాల మధ్య జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర జట్టు 18–0 స్కోర్‌తోను విజయం సాధించాయి. శ్రీకృష్ణ కోలాట బృందం, శ్రీఽభరత్ లిఖిత ఆర్కెస్ట్రా, ఆర్ టెక్నో రాక్ బ్యాండ్ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
Comments
Please login to add a commentAdd a comment