డాబాపై నుంచి పడి వ్యక్తి...
పి.గన్నవరం: ప్రమాదవశాత్తూ డాబాపై నుంచి కిందపడి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన పి.గన్నవరంలో శనివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైవీపాలెంనకు చెందిన యర్రంశెట్టి వీరా స్వామినాయుడు (55) పి.గన్నవరం శివాలయం సమీపంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. శనివారం రాత్రి డిష్ యాంటెన్నాను సరిచేసేందుకు డాబాపైకి ఎక్కాడు. ఈ క్రమంలో మెట్లపై ఉన్న చెత్తను తీసి కిందకు పడేస్తుండగా అదుపుతప్పి స్వామినాయుడు కిందకు పడిపోయాడు. తలకు గాయాలపాలైన అతడిని స్థానికి సీహెచ్‌సీకి తరలించగా ప్రాథమిక వైద్యం అందించారు. పరిస్థితి విషమించడంతో అమలాపురంలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడు. మృతదేహానికి అమలాపురం ఏరియా ఆస్పత్రిలో ఆదివారం పోస్టుమార్టం నిర్వహించారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై బి.శివకృష్ణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment