లోవలో భక్తుల రద్దీ
తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థానంలో ఆదివారం రద్దీ నెలకొంది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 8 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఇన్‌చార్జి డిప్యూటీ కమిషనర్, ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. పులిహోర, ప్రసాదం, లడ్డూల విక్రయం ద్వారా రూ.1,10,115, పూజా టికెట్లకు రూ.44,930, కేశఖండన శాలకు రూ.9,600, వాహన పూజలకు రూ.5,100, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.21,910, విరాళాలు రూ.48,108 కలిపి మొత్తం రూ.2,39,763 ఆదాయం సమకూరిందని ఈఓ వివరించారు.
రత్నగిరిపై 26న సరస్వతీ పూజ
అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని సన్నిధిన ఈ నెల 26వ తేదీన సరస్వతీ పూజ నిర్వహించనున్నట్లు దేవస్థానం అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వామివారి నిత్య కల్యాణ మండపంలో ఆ రోజు ఉదయం 9 గంటలకు సరస్వతీ దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పండితులు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం విద్యార్థులు ఉత్తమ శ్రేణి మార్కులతో ఉత్తీర్ణులవ్వాలని ప్రార్థిస్తూ అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు. ఈ పూజల్లో అన్నవరం, చుట్టుపక్కల విద్యా సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థినీ విద్యార్థులు పాల్గొనాలని అధికారులు కోరారు.
కోటసత్తెమ్మ ఆలయానికి
పోటెత్తిన భక్తులు
నిడదవోలు రూరల్: తిమ్మరాజుపాలెంలో కోటసత్తెమ్మ అమ్మ వారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారని ఆల య ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ వి.హరి సూర్య ప్రకాష్ తెలిపారు. ప్రధానార్చకుడు అప్పారావుశర్మ పర్యవేక్షణలో అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. దర్శనాలు, ప్రసాదం, పూజా టిక్కెట్లు, ఫొటోల అమ్మకం ద్వారా దేవస్థానానికి రూ.1,22,202 ఆదాయం వచ్చిందని ఈఓ తెలిపారు. ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్, చైర్మన్ దేవులపల్లి రవిశంకర్, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
లోవలో భక్తుల రద్దీ
Comments
Please login to add a commentAdd a comment