ఉల్లాసంగా ఆలిండియా హాకీ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో సివిల్ సర్వీసెస్ ఆలిండియా హాకీ పోటీలు మూడోరోజు సోమవారం ఉల్లాసంగా జరిగాయి. ఒడిశా సెక్టార్, హర్యానా మధ్య జరిగిన పోటీలో ఒడిశా 8–0 స్కోర్‌తో, ఉత్తరాఖండ్ సెక్టార్, ఢిల్లీ సెక్టార్ మధ్య జరిగిన ఉత్తరాఖండ్ మ్యాచ్‌లో 4–0 స్కోర్ తేడాతో, బీహార్ సెక్టార్, తెలంగాణ సెక్టార్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బీహార్ సెక్టార్ 15–0 స్కోర్‌తో విజయం సాధించాయి. రాయల్ స్పోర్ట్స్ బోర్డు, ఉత్తరాఖండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రాయల్ జట్టులో ఆనంద రత్నకుమార్ 3, గోవింద్, గణేష్, సుమన్‌లు చెరో ఒక్కొక్క గోల్స్ వేసి జట్టును విజయ పథంలో నడిపించారు.
బీహార్, తెలంగాణ మధ్య జరిగిన మ్యాచ్‌లో బీహార్ 15–0 స్కోర్‌తో, రాజస్థాన్, మధ్యప్రదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 2–0తో, కేరళ, ఏపీ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఏపీ 11–0 స్కోర్‌తో గెలుపొందాయి. పురుషుల విభాగంలో మధ్యప్రదేశ్, తెలంగాణ మధ్య జరిగిన పోటీలో తెలంగాణ 4–3 స్కోర్‌తో, కేరళ–ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 9–0, పుదుచ్చేరి–ఒడిశా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒడిశా 6–0 స్కోర్‌తో విజయం సాధించాయి. గోవా–మహారాష్ట్ర మధ్య జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర 18–0 స్కోర్‌తో, అహ్మదాబాద్–ఇండోర్ మధ్య జరిగిన మ్యాచ్ 2–2 స్కోర్‌తో డ్రాగా ముగిసింది. సోమవారం నిర్వహించిన మ్యాచ్‌లను టోర్నమెంట్ కో–ఆర్డినేటర్, డీఎస్‌డీఓ బి.శ్రీనివాస్ కుమార్, హాకీ సంఘ ప్రతినిధి రవిరాజు పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment