సర్వేలపై మున్సిపల్ కమిషనర్లకు శిక్షణ
కాకినాడ సిటీ: జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీల సచివాలయాల పరిధిలో ఆరు సర్వేలను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ హెచ్‌ఎస్ భావన ఆదేశించారు. ఎంఎస్‌ఎంఈ, మిస్సింగ్ సిటిజన్ ఇన్ హౌస్‌హోల్డ్స్, జియో ట్యాగింగ్, నాన్ రెసిడెన్సీ ఇన్ ఏపీ, చిల్ట్రన్స్ విత్ పుట్ ఆధార్, డెట్‌ఆడిట్ ఇలా పలు సర్వేలను పూర్తి చేయడంలో కాకినాడ నగరపాలక సంస్థ ముందంజలో ఉందన్నారు. కాకినాడ జిల్లాలోని పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం, తుని, గొల్లప్రోలు తదితర మున్సిపాలిటీలు వెనుకబడ్డాయన్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాల మేరకు కాకినాడ కమిషనర్ భావన సూచనలతో ఆయా మున్సిపాలిటీ పరిధిలోని కమిషనర్లు, నోడల్ అధికారులు, సచివాలయాల సిబ్బందికి శిక్షణను కాకినాడ నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ కార్యాలయంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్ నిర్వహించారు. సర్వేలను సకాలంలో పూర్తి చేయకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. సర్వేలను సకాలంలో పూర్తి చేయగలిగితేనే ప్రభుత్వ పథకాలకు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయవచ్చన్నారు. టీపీఆర్వో శైలజ, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.
అనుమతి తీసుకొని కవర్ చేయండి
కాకినాడ సిటీ: కాకినాడ జిల్లాలో బర్డ్‌ప్లూ బారిన పడిన కోళ్ల ఫారాలకు సంబంధించిన వార్తల కవర్ చేసే నిమిత్తం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా కొంతమంది మీడియా వారు వెళ్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కలెక్టర్ షణ్మోహన్ సగిలి సోమవారం తెలిపారు. మీడియా వారు బర్డ్స్ ఫ్లూ సోకిన కోళ్ల ఫామ్ వార్తులు కవర్ చేయడానికి వెళ్లాలనుకుంటే పశుసంవర్థకశాఖ అధికారులు, సమాచారశాఖ అధికారులు అనుమతి తీసుకుని సూచనలు, జాగ్రత్తలు తీసుకొని వార్తల కవర్ చేయడానికి వెళ్లాలని, జాగ్రత్తలు తీసుకోకుండా వెళ్లినట్లయితే మిగిలిన కోళ్లకు కూడా ఇన్‌ఫెక్షన్ వ్యాపించే అవకాశం ఉందని కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment