ప్రతిభ చూపిన విద్యార్థికి అభినందన
కాకినాడ సిటీ: న్యూఢిల్లీలో ఈ నెల ఒకటో తేదీ నుంచి 5వ తేదీ వరకు జరిగిన అంతర్జాతీయ వ్యాకో ఇండియా ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ పోటీల్లో 14 సంవత్సరాల విభాగంలో బంగారు పతకం సాధించిన కరప మండలం అరట్లకట్ట గ్రామానికి చెందిన యాళ్ల సురేష్‌కుమార్‌ను కలెక్టర్ షణ్మోహన్ అభినందించారు. సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ షణ్మోహన్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఇదే స్ఫూర్తితో మరింత ఉన్నత స్థాయికి ఎదిగేందుకు పట్టుదలతో కృషి చేయాలని ఆయన సూచించారు. న్యూఢిల్లీలో ఫోర్త్ వ్యాకో ఇండియా ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ టోర్నమెంట్ కేడి జాదేవ్ ఇండోర్ స్టేడియంలో లైట్, లైట్ కాంటాక్ట్ విభాగంలో ఏడో తరగతి చదువుతున్న సురేష్‌కుమార్‌కు క్రియేటివ్ పోలో గోల్డ్ మెడల్, లైట్ కాంటాక్ట్ విభాగంలో రెండు, బ్రాంజ్ మెడల్స్ సాధించారు. సురేష్‌కుమార్ చదువుతోపాటు ఆటలను కూడా తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలన్నారు. సురేష్‌కుమార్‌కు రూ.10,000 నగదు బహూకరించేందుకు సంసిద్ధతను తెలియజేశారు. సురేష్‌కుమార్ తండ్రి అంజిబాబును కూడా కలెక్టర్ షణ్మోహన్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment