
జేఎన్‌టీయూకే వీసీగా ప్రసాద్
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జేఎన్‌టీయూకే ఆరో ఉప కులపతిగా ప్రొఫెసర్ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తొలి వీసీగా అల్లం అప్పారావు, రెండో వీసీగా తులసీరామ్‌దాస్, మూడో వీసీగా వీఎస్‌ఎస్ కుమార్, నాలుగో వీసీగా రామలింగరాజు సేవలందించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రొఫెసర్ ప్రసాదరాజును ఐదో వీసీగా నియమించారు. మరో నాలుగు నెలల పదవీ కాలం ఉండగానే ఆయనను తప్పించి, ఇన్‌చార్జి వీసీగా ఆచార్య మురళీకృష్ణను కూటమి ప్రభుత్వం నియమించింది. రెగ్యులర్ వీసీల నియామకంలో భాగంగా ఎన్‌ఐటీ వరంగల్‌లో సివిల్ ప్రొఫెసర్‌గా ఉన్న సీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ను నియమించారు. గుంటూరు జిల్లాకు చెందిన ఆయన అమర్తలూరులో పదో తరగతి, తెనాలిలో ఇంటర్మీడియెట్, ఎన్‌ఐటీ వరంగల్‌లో బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఇప్పటి వరకూ ఎనిమిది మందికి పీహెడ్‌డీ గైడ్‌గా వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment