నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలి
డీఈఓ సలీం బాషా
సాక్షి, అమలాపురం: రానున్న పబ్లిక్ పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణతకు సమన్వయంతో పాటుపడాలని డీఈఓ షేక్ సలీం బాష ఉపాధ్యాయులు, ఎంఈఓలకు బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, అవసరమైన స్టడీ మెటీరియల్ అందించాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేకంగా మాట్లాడాలన్నారు. వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక, నాలుగు మోడల్ ప్రశ్నపత్రాలను ప్రత్యేకంగా తయారు చేసి, విద్యార్థులతో ప్రాక్టీస్ చేయించాలని సూచించారు. విద్యార్థులు అలసిపోకుండా స్నాక్స్ ఇవ్వాలని ఆదేశించారు. పాఠశాలల్లో అవసరమైన సౌకర్యాలను కల్పించాలని ఎంఈఓలను ఆదేశించారు.
టెన్నికాయిట్ పోటీలకు
సర్వం సిద్ధం
గోపాలపురం: రాష్ట్ర స్థాయి టెన్నికాయిట్ పోటీలకు చిట్యాల జెడ్పీ హైస్కూల్ క్రీడా మైదానంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పోటీల్లో ఉమ్మడి జిల్లాలతో పాటు, రెండు కొత్తవి కలిపి మొత్తం 15 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారని పోటీల ఆర్గనైజింగ్ సెక్రటరీ గద్దే చంద్రశేఖర్, హెచ్‌ఎం ఎస్‌ఎల్‌ఎన్ శాస్త్రి తెలిపారు. ఈ నెల 21న ప్రారంభమయ్యే పోటీలు 22వ తేదీతో ముగుస్తాయని చెప్పారు. రేయింబవళ్లు పోటీలు జరుగుతాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment