రాష్ట్ర స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ జట్ల ఎంపిక
తుని రూరల్: తిరుపతి బోనగిరిలో ఈ నెల 21 నుంచి మూడు రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పురుషుల, మహిళల జట్లు ఎంపికయ్యాయి. బుధవారం తుని మండలం హంసవరం మోడల్ స్కూల్ మైదానంలో ఎంపికలు చేసినట్టు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కలిదిండి సత్యనారాయణరాజు తెలిపారు. ఇరు జట్ల నుంచి 24 మంది క్రీడాకారులు పాల్గొంటారని చెప్పారు. సంఘ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కేఎస్ జాబ్స్, జిల్లా కార్యదర్శి గంటా విక్టర్‌బాబు, స్కూల్ ప్రిన్సిపాల్ పద్మజ ఆధ్వర్యంలో ఈ ఎంపికలు జరిగాయి.
పురుషుల జట్టు: ఆర్.రాహుల్, వై.వెంకట సాత్విక్, టి.కార్తికేయ, ఎం.అరవింద్, జి.శ్రీనాగ వీరసాయితేజ, పి.దుర్గాఅరవింద్, కె.రామ్‌చరణ్, జి.జగన్‌ప్రకాష్, టి.ఉమేష్, ఎం.యశ్వంత్, జి.పవన్, జి.ఆకాష్.
మహిళల జట్టు: ఎస్.రేణుక, పి.నవ్యశ్రీ, ఎస్.సాయిరేఖ, జె.హరిణి, కె.మౌనిక, సీహెచ్ దేవి, కె.కనకదుర్గ, వి.విజయ దుర్గాభవాని, జి.దుర్గాసత్యశ్రీ, ఎం.త్రినేత్రదేవి, బి.వెన్నెల, పి.గంగ.
Comments
Please login to add a commentAdd a comment