మాస్టర్‌ ప్లాన్‌కు సూచనలు ఇవ్వండి | - | Sakshi
Sakshi News home page

మాస్టర్‌ ప్లాన్‌కు సూచనలు ఇవ్వండి

Published Thu, Feb 20 2025 12:12 AM | Last Updated on Thu, Feb 20 2025 12:09 AM

మాస్టర్‌ ప్లాన్‌కు సూచనలు ఇవ్వండి

మాస్టర్‌ ప్లాన్‌కు సూచనలు ఇవ్వండి

కాకినాడ సిటీ: కోరంగి వైల్డ్‌లైఫ్‌ అభయారణ్యం ఎకో–సెన్సిటివ్‌ జోనల్‌ మాస్టర్‌ ప్లాన్‌ తయారీకి సంబంధిత అధికారులు తమ సూచనలు, సలహాలు అందించాని జిల్లా కలెక్టర్‌ షణ్మోహన్‌ సగిలి కోరారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్‌లో కలెక్టర్‌ షణ్మోహన్‌ జిల్లా అటవీశాఖ అధికారి డి.రవీంద్రనాథ్‌రెడ్డితో కలిసి కోరంగి వైల్డ్‌ లైఫ్‌ అభయారణ్యం జోనల్‌ మాస్టర్‌ ప్లాన్‌ తయారీపై అటవీ, రెవెన్యూ, మత్స్య, భూగర్భ జలాలు, పశుసంవర్థక, ఉద్యాన, మున్సిపల్‌ కార్పొరేషన్‌, సర్వే ఇతర శాఖల అధికారులతో కలిసి నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. డీఎస్‌వో రవీంద్రనాథ్‌రెడ్డి కోరంగి వైల్డ్‌లైఫ్‌ అభయారణ్యం జోనల్‌ మాస్టర్‌ ప్లాన్‌ తయారీ ఆవశ్యకతను సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ షణ్మోహన్‌ మాట్లాడుతూ అభయారణ్యం బయట ఉన్న సరిహద్దు నుంచి వివిధ ప్రదేశాల్లో 26 కిలోమీటర్లు దూరం వరకు ఎకో–సెన్సిటివ్‌ జోన్‌ ఉంటుందన్నారు. ఈ జోన్‌ వల్ల వన్యప్రాణుల స్వేచ్ఛకు, మనుగడకు మరింత భద్రత ఏర్పడుతుందన్నారు. పర్యావరణ సమతుల్యత నెలకొని పచ్చదనం పెంపొందడంతో పాటు సేంద్రీయ వ్యవసాయానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ జోన్‌ పరిధిలో వర్షపు నీటిని వివిధ పద్ధతుల్లో నిల్వ చేసుకొని జంతువులకు నీటి సమస్య లేకుండా చేయవచ్చని కలెక్టర్‌ వివరించారు. ఈ నేపథ్యంలో తిరువనంతపురం సెంటర్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌, డెవలప్‌మెంట్‌ ఎకో–సెన్సిటీవ్‌ జోనల్‌ మాస్టర్‌ ప్లాన్‌ తయరు చేయనుందని దీనికి సంబంధించి సంబంధిత శాఖల అధికారులు తమ సూచనలు, సలహాలు అందించాల సూచించారు. ఈ సమావేశంలో తిరువనంతపురం సెంటర్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌, డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం డైరెక్టర్‌ డాక్టర్‌ టీవీ వినోద్‌, హైదరాబాద్‌ సెంటర్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌ రీజనల్‌ డైరెక్టర్‌ కె జయచంద్ర, పశుసంవర్థకశాఖ జేడీ ఎస్‌ సూర్యప్రకాశరరావు, మత్స్యశాఖ అధికారి కె కరుణాకర్‌బాబు, గ్రౌండ్‌ వాటర్‌ డీడీ పి రాధాకృష్ణ, కాకినాడ అటవీశాఖాధికారి శ్రీదీప్తి, కోరంగి వైల్డ్‌లైఫ్‌ అటవీ అధికారి ఎస్‌ఎస్‌ఆర్వీ వరప్రసాద్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement