మమ్మల్ని పట్టించుకునే వారు లేరు
నష్టమైనా, కష్టమైనా చేనేతనే నమ్ముకుని కుటుంబాలను పొషించుకుంటున్నాం. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నేతన్న నేస్తం ఇచ్చి ఏటా సాయం అందించడంతో మాకు కొండంత అండగా ఉండేది. ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో మాకు ఉపాధి తగ్గుతూ వస్తోంది. పడుగు ధర రెండేళ్లతో పోల్చుకుంటే రెట్టింపు అయింది. కిలో పడుగు ధర రూ.5 వేల నుంచి రూ.8 వేలకు పెరిగింది. నేతకు ఉపయోగించే ముడి సరుకు ధరలు విపరీతంగా పెదరగడంతో గణనీయంగా ఉపాధి తగ్గిపోయింది. రోజంతా కుటుంబం మొత్తం కష్టపడితే రూ.300 మించి కూలీ కూడా రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోకపోవడం దారుణం.
– గుండారపు పార్వతి, నేత కార్మికురాలు, వాకతిప్ప, కొత్తపల్లి మండలం
Comments
Please login to add a commentAdd a comment