హామీలు మర్చిపోతే ఎలా?
ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు. వాటిని నమ్మి మేము ఓట్లు వేశాం. ఇప్పుడు వాటిని మర్చిపోతే ఎలా. నేతన్న నేస్తం వల్ల ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా లబ్ధి పొంది నిలదొక్కుకున్నాయి. అలాంటి నేతన్న నేస్తం అందక పోతే చాలా నేత కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటాయి. నెరవేర్చలేనప్పుడు హామీలు ఇవ్వకూడదు. ప్రస్తుతం నేత కుటుంబాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. వాటిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోపోవడం దురదృష్టకరం.
– దౌడురి భాస్కరరావు, చేనేత కార్మికుడు,
తాటిపర్తి, గొల్లప్రోలు మండలం
Comments
Please login to add a commentAdd a comment