కాకినాడ సిటీ: జిల్లా పరిషత్ కార్యాలయంలో పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ శుక్రవారం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ షణ్మోహన్ సగిలి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పెన్షన్, జీపీఎఫ్ కేసులను సమీక్షించడానికి, పరిష్కరించడానికి, డీడీవోలకు సమర్థవంతంగా సేవలను అందించడానికి ఈ అదాలత్ జరుగుతోందన్నారు. జిల్లాలో ని డ్రాయింగ్, పంపిణీ అధికారులందరూ పెండింగ్ లో ఉన్న పెన్షన్, జీపీఎఫ్ సమస్యల వివరాలతో ఈ అదాలత్‌కు హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment