‘రత్నగిరి...చివరాఖరికి..’పై జిల్లా యంత్రాంగం సీరియస్
అన్నవరం దేవస్థానంపై సోమవారం
సమీక్షించనున్న జిల్లా కలెక్టర్ షణ్మోహన్
అన్నవరం: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవీఆర్‌ఎస్) ద్వారా భక్తుల అభిప్రాయాల ఆధారంగా ఇచ్చిన ర్యాంకుల్లో అన్నవరం దేవస్థానం చివరాఖరు ఏడో ర్యాంకు రావడంపై జిల్లా యంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. జిల్లాలో గల ఏకై క పెద్ద పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం రాష్ట్రంలో చివరి ర్యాంకు రావడంపై శుక్రవారం సాక్షి దినపత్రికలో ‘ ‘రత్నగిరి ..చివరాఖరికి...’ శీర్షికన వార్త ప్రచురితమైన విషయం తెలిసిందే. ఆ వార్తలో ఏడో ర్యాంకు రావడానికి దారితీసిన పరిస్థితులను కూడా ప్రస్తావించడం జరిగింది. దీనిపై జిల్లా కలెక్టర్ షణ్మోహన్ స్పందించారు. అతి తక్కువ సమయంలో దేవస్థానం పరిస్థితి ఎందుకిలా దిగజారిందనే దానిపై దేవస్థానం అధికారులతో స్వయంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సోమవారం చర్చించనున్నారు. ఈ మేరకు అన్నవరం దేవస్థానంలో సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో బాటు దేవస్థానం ఆర్థిక పరిస్థితి గతంలో ఎన్నడూ లేని విధంగా దిగజారడంపైన కూడా చర్చించనున్నారు. వీటితో బాటు ఏ విధమైన చర్యలు తీసుకుంటే దేవస్థానానికి తిరిగి పూర్వ వైభవం వస్తుందనే దానిపై కూడా చర్చించనున్నారు. సిబ్బంది పనితీరుపై సమీక్షించనున్నారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు ఇతర అధికారులు కూడా పాల్గొంటారని దేవస్థానం వర్గాలు తెలిపాయి.
‘రత్నగిరి...చివరాఖరికి..’పై జిల్లా యంత్రాంగం సీరియస్
Comments
Please login to add a commentAdd a comment