తల్లి ప్రోత్సాహంతోనే ఐపీఎస్
● ట్రైనీ అసిస్టెంట్ ఎస్పీ సుస్మిత
● తిమ్మాపురం ఎస్‌హెచ్‌ఓగా
బాధ్యతల స్వీకరణ
కాకినాడ రూరల్: తల్లి ప్రోత్సాహంతో తాను ఐపీఎస్‌గాను, సోదరిణి ఐఏఎస్‌గా ఎంపికయ్యామని 2023 ఏపీ కేడర్ ఐపీఎస్‌గా ఎంపికై న తమిళనాడుకు చెందిన ఆర్.సుస్మిత తెలిపారు. అసిస్టెంట్ ఎస్పీగా జిల్లాలో ట్రైనీలో ఉన్న ఆమె శుక్రవారం కాకినాడ రూరల్ సర్కిల్ పరిధిలోని తిమ్మాపురం స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్‌హెచ్‌ఓ) బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తమిళనాడులోని కడలూరుకు చెందిన తమది వ్యవసాయ కుటుంబమన్నారు. తండ్రి వ్యవసాయం చేస్తారని, తల్లి ఎడ్యూకేషన్ డిపార్టుమెంట్‌లో నాన్ టీచింగ్ స్టాఫ్‌గా పనిచేస్తున్నారన్నారు. తమ్ముడు చదువుకుంటున్నాడని, అక్కా, తాను ఐఏఎస్, ఐపీఎస్‌గా ఎంపికయ్యామన్నారు. తల్లి ప్రోత్సాహంతో తాను ఆరుసార్లు ప్రయత్నంతో ఐపీఎస్ సాధించానన్నారు. ఎస్‌హెచ్‌ఓగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు చదువు ఆవశ్యత తెలియజేయడంతో పాటు గుడ్, బ్యాడ్ టచ్, సైబర్ నేరాలు గురించి అవగాహన కల్పించేందుకు ప్రాధాన్యం ఇస్తానన్నారు. తిమ్మాపురం స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడంతో పాటు గంజాయి నిర్మూలనపై దృష్టి పెడతామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు గాను ఆర్టీఐ నిబంధనలు పాటించని వాహనదారులపై కేసులు నమోదు చేస్తామన్నారు. ముఖ్యంగా నంబరు ప్లేట్లపై దృష్టి పెడతామన్నారు. హెల్మెట్ ఆవశ్యకతను వివరిస్తామన్నారు.
గ్రూప్–2 మెయిన్స్
పరీక్షలకు ఏర్పాట్లు
కాకినాడ సిటీ: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నెల 23న నిర్వహిస్తున్న గ్రూప్–2 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు నిర్వహించాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాకినాడ కలెక్టరేట్‌లో ఏపీపీఎస్సీ గ్రూప్–2 మెయిన్స్, ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ఏపీపీఎస్సీ, రెవెన్యూ, ఇంటర్మీడియెట్ అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. కాకినాడ, పెద్దాపురం ఆర్డీవోలు ఎస్.మల్లిబాబు, కె.శ్రీరమణి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్–2 మెయిన్స్ పరీక్ష ఈ నెల 23, ఆదివారం ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా పరీక్ష జరుగుతుందన్నారు. 9,379 అభ్యర్థుల నిమిత్తం కాకినాడ జిల్లాలో 12 పరీక్షా కేంద్రాల ఏర్పాటు చేశామన్నారు. గ్రూప్–2 మెయిన్స్ పరీక్షకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment