కార్యకర్తలకు అండగా ఉంటా
కాకినాడ రూరల్: జిల్లాలో కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నిమితులైన అనంతరం తొలిసారిగా కాకినాడలో మాజీ మంత్రి, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో ఆర్డినేటరు కురసాల కన్నబాబును ఆయన నివాసంలో శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా రాజాకు పూలమాలలు వేసి స్వాగతం పలికిన కన్నబాబు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు. పార్టీ నాయకులు కూడా రాజాను సత్కరించారు. అనంతరం ఇద్దరు నేతలు కొద్ది సేపు జిల్లాలో వైఎస్సార్ సీపీ బలోపేతం గురించి చర్చించుకున్నారు. అనంతరం దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడుతూ తనను నమ్మి జగన్‌మోహన్‌రెడ్డి నియమించడంతో బాధ్యతలు స్వీకరించానని, అందరి నాయకులను కలుసుకుని సమన్వయంతో ముందుకు వెళుతున్నానన్నారు. కార్యకర్తల సమస్యలు పరిష్కరించడంతో పాటు అంకితభావంతో నాయకులందరూ పార్టీ కోసం పని చేసేలా కృషి చేస్తానన్నారు. అనంతరం కన్నబాబు మీడియాతో పార్టీని బలోపేతం చేయడానికి నాయకలంతా గట్టిగా పనిచేస్తామన్నారు. కాకినాడ పార్లమెంట్ పరిధిలో పార్టీకి ఆదరణతో పాటు జగన్‌మోహన్‌రెడ్డిపై నమ్మకం కూడా ఉందన్నారు. తునిలో జరిగిన సంఘటన దుర్మార్గమన్నారు. లా అండ్ ఆర్డర్‌ను చేతుల్లోకి తీసుకుంటున్నారని, ప్రతి కార్యకర్తను కాపాడుకునే విధంగా పార్టీ ముందుకు వెళుతుందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు నురుకుర్తి రామకృష్ణ, సర్పంచ్‌లు బెజవాడ సత్యనారాయణ, రామదేవు సూర్య ప్రకాశరావు, పార్టీ నాయకులు జమ్మలమడక నాగమణి, రావూరి వెంకటేశ్వరరావు, గోపుశెట్టి బాబ్జీ, పుల్ల చందు, అనుసూరి ప్రభాకర్, లింగం రవి, అనుసూరి ప్రభాకర్, పల్లంరాజు, నక్కా సత్యనారాయణ, కొండలరావు, కర్రి చక్రధర్, రెడ్డి నాయుడు, వరప్రసాద్ పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
దాడిశెట్టి రాజా
పార్టీ రీజనల్ కో ఆర్డినేటరు
కన్నబాబును మర్యాదపూర్వకంగా
కలయిక
Comments
Please login to add a commentAdd a comment