
ఉత్సాహంగా హాకీ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటి): కాకినాడ జిల్లా క్రీడామైదానంలో జరుగుతున్న సివిల్ సర్వీసెస్ ఆల్ ఇండియా హాకీ పోటీలు శనివారం ఉత్సాహంగా జరిగాయి. రెడ్‌క్రాస్ రాష్ట్ర చైర్మన్ వైడీ రామారావు, ఒలింపిక్ సంఘ సీఈఓ, ప్రధాన కార్యదర్శి చుండ్రు గోవిందరాజు, ట్రస్ట్ హాస్పటల్ అధినేత డాక్టర్ రామకృష్ణలు క్రీడాకారులను పరిచయం చేసుకుని ప్రారంభించారు. మహిళల విభాగంలో బీహార్ సెక్టార్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒడిస్సా సెక్టార్ 7–0 స్కోర్‌తో, ఢిల్లీ సెక్టార్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్యాణా సెక్టార్ 4–0 స్కోర్‌తో, తెలంగాణ సెక్టార్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉత్తరాఖండ్ సెక్టార్ 20–0 స్కోర్‌తో గెలిచాయి. పురుషుల విభాగంలో కర్ణాటక సెక్టార్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిశా 10–2 స్కోర్‌తో, ఆర్బీఎస్ సిమ్లా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్బీఎస్ కాన్‌పూర్ 2–0 స్కోర్‌తో గెలవగా, ఆర్బీఎస్ ముంబాయి, ఆర్బీఎస్ బెంగుళూరు మధ్య జరిగిన మ్యాచ్ 1–1 స్కోర్‌తో డ్రాగా ముగిసింది. ఉత్తరాఖండ్ సెక్టార్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ సెక్టార్ 5–0 స్కోర్‌తోను, మధ్యప్రదేశ్ సెక్టార్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ సెక్టార్ 5–0 స్కోర్‌తో విజయం సాధించాయి.
Comments
Please login to add a commentAdd a comment