
శతాబ్ది వేడుకలకు సర్వం సిద్ధం
● 1924లో నిర్మించిన హైస్కూల్‌గా గుర్తింపు
● పూర్వ విద్యార్థులకు, గురువులకు
సత్కారాలు
సామర్లకోట: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో శతాబ్ది వేడుకలు నిర్వహించడానికి పూర్వ విద్యార్థులు సర్వం సిద్ధం చేశారు. సామర్లకోట–పిఠాపురం ముఖ్య కూడలిలో పిఠాపురం రాజా రావు జగపతి సూర్యారావు బహుదూర్ ఇచ్చిన సుమారు 30 ఎకరాల స్థలంలో 1924లో స్థాపించిన హైస్కూల్ శతాబ్ది వేడుకను ఆదివారం నిర్వహిస్తున్నారు. జిల్లా పరిషత్ హైస్కూల్ నుంచి ప్రభుత్వ హైస్కూల్, 1972లో ప్రభుత్వ జూనియర్ కళాశాలగా గుర్తింపు పొందింది. ఈ పాఠశాల పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇందులో భాగంగా పసల పద్మ రాఘవరావు, కొప్పిరెడ్డి సత్యనారాయణమూర్తి, దవులూరి సుబ్బారావు, గ్రంథం రామకృష్ణ, రెడ్నం లక్ష్మీపతిరావు, సత్తార్, గద్దె లచ్చన్న, అళ్లకి వెంకటకృష్ణశాస్త్రి, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, యండ్రు ప్రభాకర రావులు ఉత్సవాల ఏర్పాట్ల నాయకత్వ బాధ్యతలు తీసుకుని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులతో పాటు నాటి గురువులను సత్కరించనున్నారు. వెయ్యి మందికి మించి పూర్వ, ప్రస్తుత విద్యార్థులు హాజరవుతారని, ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగనున్న ఈ కార్యక్రమానికి ఈ పాఠశాలలో చదివి 50, 75 ఏళ్లు పూర్తి చేసుకున్న విద్యార్థులు మరింత ఉత్సాహంగా హాజరు కానున్నట్టు తెలిసింది.
వేడుక జరగనున్న కళాశాల ఆవరణ
Comments
Please login to add a commentAdd a comment