పెండింగ్ పెన్షన్, జీపీఎఫ్‌లను పరిష్కరిస్తాం
కాకినాడ సిటీ: ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ చేసిన మొదటి నెలలోనే పెన్షన్ పొందడమే లక్ష్యంగా పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ నిర్వ హణ ముఖ్య లక్ష్యమని, పెండింగ్‌లో ఉన్న పెన్షన్, జీపీఎఫ్‌లను పరిష్కరిస్తామని కలెక్టర్ షణ్మోహన్ సగిలి, రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్.శాంతిప్రియ అన్నారు. శుక్రవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్ సమావేశపు మందిరంలో కాకినాడ జిల్లా పెన్షన్ అదాలత్, జీపీఎప్ అదాలత్, ఇతర అనుబంధ సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన ఒకరోజు అవగాహన పరిష్కార కార్యక్రమంలో వారు మాట్లాడారు. ప్రతి ఉద్యోగి తన సర్వీస్‌కు సంబంధించిన అన్ని అంశాలు సర్వీస్ రిజిస్టర్‌లో నమోదు అయ్యే విధంగా చూడాలన్నారు. జీపీఎఫ్ ప్రతిపాదనలు పంపండంలో డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ అధికారులు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్.శాంతిప్రియ మాట్లాడుతూ వివిధ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల పెన్షన్ ప్రతిపాదనలు పదవీ విరమణ తేదీకి 6 నెలల ముందే సంబంధిత జిల్లా డ్రాయింగ్ అండ్ పంపిణీ అధికారులు వారి పెన్షన్ పత్రాలను సమర్పించాలన్నారు. పెన్షనర్ల పదవి విరమణ చేసే ఆరు నెలల ముందు పెన్షన్ పేపర్లు అకౌంటెంట్ జనరల్‌కి పంపాలని సీనియర్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ పోలు కిషోర్‌రెడ్డి తెలిపారు. 40 శాతం మంది పెన్షన్ పేపరు పదవీ విరమణ చేసిన నాలుగు నెలల తర్వాత పెన్షన్ పేపర్లు సమర్పించడం వల్ల ఆలస్యంగా బెనిఫిట్స్ వస్తున్నట్లు వివరించారు. డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ ఎన్ మోహన్‌రావు మాట్లాడుతూ డీడీవో సక్రమంగా ప్రతిపాదనలు పంపితే సకాలంలో పెన్షన్ ఇతర బెనిఫిట్స్ విడుదల చేసే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది పాత పెన్షన్ పొందుతున్నారన్నారు. వాటికి సంబంధించి ఆయా డ్రాయింగ్ అధికారులు ప్రతిపాదనలు సిఫార్సు చేస్తే ప్రస్తుత పీఆర్సీకి అనుగుణంగా పెన్షన్ పొందే అవకాశం ఉంటుందని వివరించారు. పలువురు పెన్షనర్లు, అధికారులు, ఉద్యోగులు వివిధ అంశాలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. పలువురికి పెన్షన్ మంజూరు పత్రాలను రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ శాంతిప్రియ చేతుల మీదుగా అందజేశారు. కాకినాడ జిల్లా అడిషనల్ ఎస్సీ భాస్కరరావు, డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ ఎన్ మోహన్‌రాావు, సీనియర్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ పి కిషోర్‌రెడ్డి, వి లలిత్‌కుమార్, సీనియర్ అకౌట్స్ ఆఫీసర్లు జి సునీత, టి విజయ్‌కుమార్, డి చంద్రశేఖర్, కాకినాడ జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్ ఎన్ శ్రీనువాసులు పాల్గొన్నారు.
కలెక్టర్ షణ్మోహన్
Comments
Please login to add a commentAdd a comment