
నేడు సివిల్ సర్వీసెస్ హాకీ ఫైనల్స్
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఆలిండియా సివిల్ సర్వీసెస్ కల్చరల్, స్పోర్ట్స్ బోర్డు పర్యవేక్షణలో జిల్లా క్రీడా మండలి ఆధ్వర్యాన కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో జరుగుతున్న ఆలిండియా సివిల్ సర్వీసెస్ పురుషులు, మహిళల హాకీ పోటీల ఫైనల్స్ శుక్రవారం జరగనుంది. గురువారం మహిళల సెమీ ఫైనల్స్‌లో ఒడిశా – ఆంధ్రప్రదేశ్ సెక్టార్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒడిశా 6–0 స్కోర్‌తో, సెంట్రల్ సెక్టార్ – హర్యానా మధ్య జరిగిన మ్యాచ్‌లో సెంట్రల్ సెక్టార్ 6–0 స్కోర్‌తో విజయం సాధించి, ఫైనల్స్‌కు చేరుకున్నాయి. పురుషుల విభాగంలో సెంట్రల్ సెక్టార్ – ఒడిశా మధ్య జరిగిన మ్యాచ్‌లో సెంట్రల్ సెక్టార్ 8–2 స్కోర్‌తో, ఆర్‌ఎస్‌బీ హైదరాబాద్ – హర్యానా సెక్టార్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్‌ఎస్‌బీ హైదరాబాద్ 5–0 స్కోర్‌తో ఫైనల్స్‌లో చోటు దక్కించుకున్నాయి. ముగింపు వేడుకల్లో భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్, ఒలింపియన్ ధనరాజ్ పిళ్లై, కలెక్టర్ షణ్మోహన్, ఇన్‌కమ్‌ట్యాక్స్ డైరెక్టర్ జనరల్ హాజరు కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment