
నేడు కవిశేఖర జయంతి
కాకినాడ రూరల్: మహాకవిగా, శతావధానిగా, తత్త్వవేత్తగా, సంఘ సంస్కర్తగా, స్వాతంత్య్ర సమర యోధుడిగా, రాజకీయ నాయకుడిగా, శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠానికి షష్ఠమ పీఠాధిపతిగా.. విభిన్న రంగాల్లో ప్రత్యేక ముద్రవేసుకున్న కవిశేఖర డాక్టర్ ఉమర్ ఆలీషా 140వ జయంత్యుత్సవం శుక్రవారం నిర్వహించనున్నారు. సర్పవరం జంక్షన్ బోట్‌క్లబ్ వద్ద ఉన్న విగ్రహం వద్ద ఈ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నామని పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు తెలిపారు. అనంతపురంలో జరిగే జయంతి వేడుకల్లో ప్రస్తుత నవమ పీఠాధిపతి ఉమర్ ఆలీషా పాల్గొననున్నారు. కాకినాడ వేడుకల్లో ఆయన సోదరులు పాల్గొంటారని సూరిబాబు తెలిపారు.
5, 6 తేదీల్లో ఉద్యోగినులకు
సెలవు ఇవ్వరూ..
కాకినాడ సిటీ: వచ్చే నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని మహిళా ఉద్యోగులకు ఆటపోటీలు నిర్వహించనున్నామని ఎన్‌జీఓ సంఘ నాయకులు తెలిపారు. దీనికి వీలుగా మార్చి 5, 6 తేదీల్లో ఉద్యోగినులకు సెలవు దినాలుగా ప్రకటించాలని కోరుతూ కలెక్టర్ షణ్మోహన్‌కు గురువారం కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. ఈ పోటీలను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గ్రౌండ్స్‌లో ప్రారంభించాలని కలెక్టర్ అనుమతి కోరారు. ఎన్‌జీవో సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గుద్దటి రామ్మోహనరావు ఈ వివరాలు తెలిపారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో సంఘం ఉమ్మడి జిల్లా నాయకులు పేపకాయల వెంకటకృష్ణ, పసుపులేటి శ్రీనివాసరావు, వై.పద్మ మీనాక్షి తదితరులుఉన్నారు.
వసతి గదుల కార్యాలయం వద్ద ఫ్రీ వైఫై
అన్నవరం: జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఇటీవల అన్నవరం దేవస్థానంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సందర్భంగా డిజిటల్ పేమెంట్లకు ఫ్రీ వైఫై సదుపాయం కల్పించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రత్నగిరిపై వసతి గదుల కార్యాలయంలో అధికారులు ఫ్రీ వైఫై ఏర్పాటు చేసి, డిజిటల్ పేమెంట్లకు అవకాశం కల్పించారు. ఆ కార్యాలయం వద్దకు వచ్చిన వెంటనే సెల్‌ఫోన్‌లో వైఫై ఆన్ చేయగానే సీఆర్‌ఓ రూముల బుకింగ్ అని వస్తుంది. దానిపై క్లిక్ చేయగానే వైఫై ఆన్ అవుతుంది. తద్వారా సత్యదేవుని సన్నిధిలో ఫోన్ పే, గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపుల ద్వారా వసతి గదులు పొందే అవకాశం భక్తులకు కలిగింది.
వాట్సాప్ గవర్నెన్స్‌లో
రిఫండ్ ఆప్షన్
అన్నవరం: సత్యదేవుని సన్నిధి సహా ఇతర దేవస్థానాల్లో వాట్సాప్ నంబర్ 95523 00009 ద్వారా మన మిత్ర పేరుతో అమలు చేస్తున్న వాట్సాప్ గవర్నెన్స్‌లో రిఫండ్ ఆప్షన్‌ను కూడా చేర్చారు. ఈ మేరకు రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయ శాఖ ఇన్‌చార్జి కమిషనర్ కె.రామచంద్ర మోహన్ గురువారం అన్ని దేవస్థానాలకూ సర్క్యులర్ జారీ చేశారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా దేవస్థానాల్లో వివిధ సేవలు, దర్శనాల టికెట్లు కొనుగోలు చేసిన కొనుగోలు చేసిన భక్తులకు ఏ కారణంతోనైనా వారి అకౌంట్ నుంచి నగదు కట్ అయి, టికెట్ రాకుంటే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించనున్నారు.
ఇప్పటి వరకూ వాట్సాప్ గవర్నెన్స్‌లో ఈ ఆప్షన్ లేదు. నగదు కట్ అయి టికెట్లు రాని వారు ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఆయా సేవల టికెట్లు లేదా విరాళాల రశీదులు రాకపోతే భక్తులు ఆయా దేవస్థానాల్లోని హెల్ప్ డెస్క్ లేదా కాంటాక్ట్ పాయింట్‌లో ఫిర్యాదు చేయాలి. నగదు చెల్లించినట్లు ఆధారాలు చూపాలి.
ఆ వివరాలను వాట్సాప్ గవర్నెన్స్ నిర్వహిస్తున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు పంపిస్తారు. బ్యాంకు పరిశీలన, నిర్ధారణ అనంతరం ఆ నగదును ఆ భక్తుని అకౌంట్‌కు జమ చేస్తారు. ఎటువంటి అవకతవకలకు ఈ మొత్తం వ్యవహారాన్ని రికార్డు చేయాలని, ఆడిట్ సమయంలో ఆడిట్ అధికారులకు సమర్పించాలని కమిషనర్ సూచించారు.

నేడు కవిశేఖర జయంతి
Comments
Please login to add a commentAdd a comment