
వాలీబాల్ పోటీలో విజేత ఇన్‌కమ్ ట్యాక్స్ చైన్నె
ఉప్పలగుప్తం: జాతీయ వాలీబాల్ పోటీల్లో ఇన్‌కమ్ ట్యాక్స్ చైన్నె జట్టు విజేతగా నిలిచింది. ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో జరుగుతున్న అరిగెల శ్రీరంగయ్య మెమోరియల్ నేషనల్ మెన్ వాలీబాల్ టోర్నమెంట్ శనివారం రాత్రితో ముగిసింది. ఫైనల్స్‌లో ఇన్‌కమ్ టాక్స్ చైన్నె జట్టు తమ సమీప ఇండియన్ బ్యాంక్ చైన్నె జట్టుపై 26–24, 25–23, 25–22 తేడాతో వరుస మూడు సెట్లలో విజయం సాధించింది. ముంబయి హూపర్స్ మూడు, ముంబయి జీఎస్టీ జట్టు నాల్గో స్థానాలు దక్కించుకున్నాయి.
ప్రేక్షకుల హృదయాలను గెలిచేలా..
గెలుపు.. ఓటములను పక్కన పెడితే మొత్తం జాతీయ వాలీబాల్ పోటీలో ముంబయి జట్టు ప్రేక్షకుల మనసుల్లో విజేతగా నిలిచింది. ముంబయి హూపర్స్ జట్టులో ఎక్కువ మంది క్రీడాకారులు చైన్నె గల్లీ టీమ్ సభ్యులు. కానీ వారు జాతీయ క్రీడాకారులను తలదన్నేలా పోటీ పడ్డారు. ఈ జట్టు క్రీడాకారులకు కనీసం కాళ్లకు షూ కూడా లేవు. కానీ ప్రతి క్రీడాకారుడు అద్భుత ప్రతిభ కనబరుస్తూ ప్రేక్షకుల నుంచి జేజేలు అందుకున్నాడు. ఈ జట్టులో జర్సీ నెంబర్ సెవెన్ సెల్వన్ సెట్టర్‌గా ఉత్తమ ప్రతిభ పాటవాలు ప్రదర్శించారు. ఈ జట్టు టోర్నమెంట్‌లో మూడవ స్థానం దక్కించుకుంది. అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షుడు లకీ్‌ష్ నారాయణ, డీఎస్పీ ప్రసాద్, ఆర్గనైజింగ్ కార్యదర్శి గొలకోటి ఫణి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment