కాకినాడ సిటీ: ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆటల పోటీల్లో పాల్గొనేందుకు ఈ నెల 5, 6 తేదీల్లో ఉద్యోగినులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేసినట్లు కలెక్టర్ షణ్మోహన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్, గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నేతల అభ్యర్థన మేరకు సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
ఇంటర్ పరీక్షలు ప్రారంభం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లావ్యాప్తంగా 56 కేంద్రాల్లో ఇంటర్మీడియెట్ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు మొదటి సంవత్సరం జనరల్ విభాగంలో తెలుగు, సంస్కృతం, హిందీ, ఒకేషనల్ జీఎఫ్‌సీ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 22,774 మంది హాజరు కాగా, 857 మంది గైర్హాజరయ్యారు. వృత్తి విద్యా విభాగంలో జనరల్ ఫౌండేషన్ కోర్సు (జీఎఫ్‌సీ) పరీక్షలకు 1,775 మంది హాజరు కాగా, 118 మంది గైర్హాజరయ్యారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోలేదు. తొలి రోజు 24 పరీక్ష కేంద్రాలను స్క్వాడ్స్ తనిఖీ చేశాయి. ఆరు కేంద్రాలను సిట్టింగ్ స్క్వాడ్స్ పర్యవేక్షించాయి. 144 సెక్షన్ విధించడంతో అన్ని పరీక్ష కేంద్రాల గేట్లను ఉదయం 9 గంటలకే మూసివేశారు. నగరంలోని పరీక్ష కేంద్రాలను ప్రాంతీయ ఇంటర్మీడియెట్ బోర్డు అధికారి నూకరాజు తనిఖీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment