ఎమ్మెల్సీగా పేరాబత్తుల విజయం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసింది. కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజేశేఖరం, పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీర రాఘవులు మధ్య ప్రధానంగా పోటీ జరిగింది. మరో 33 మంది స్వతంత్రులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ ఎన్నికల్లో పేరాబత్తుల తన సమీప ప్రత్యర్థి, పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీర రాఘవులుపై 77,461 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొదట ప్రాధాన్య ఓట్లు 50 శాతం పైచిలుకు సాధించడంతో ఆయనను విజేతగా ప్రకటించారు. ఏలూరు సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ముగిసింది. సోమవారం ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకూ బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను కట్టలు కట్టడానికే సమయం సరిపోయింది. 28 టేబుల్స్ ఏర్పాటు చేసి 17 రౌండ్లు నిర్వహించేలా కట్టలు కట్టారు. ఎట్టకేలకు రాత్రి 10 గంటలకు కౌంటింగ్ ప్రారంభించారు. ప్రతి టేబుల్‌కు వెయ్యి చొప్పున సగటున ప్రతి రౌండ్‌లో 28 వేల ఓట్లు లెక్కించి, 8 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియను ముగించారు. మొత్తం 2,18,997 ఓట్లు పోలవగా వాటిలో 19,789 ఓట్లు చెల్లనివిగా నిర్ధారించారు. మిగిలిన 1,99,208 ఓట్లను లెక్కించారు. ప్రతి రౌండ్‌లోనూ కూటమి అభ్యర్థి ఆధిక్యం కొనసాగింది. మొదటి రౌండ్‌లో 28 వేల ఓట్లు లెక్కించగా కూటమి అభ్యర్థికి 16,520, పీడీఎఫ్ అభ్యర్థి 5,815 చొప్పున ఓట్లు దక్కాయి. ఎనిమిది రౌండ్లు కలిపి టీడీపీ అభ్యర్థికి 1,24,702 మొదటి ప్రాధాన్య ఓట్లు రాగా.. పీడీఎఫ్ అభ్యర్థి 47,241 ఓట్లు దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ తనయుడు జీవీ సుందర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, మెరుగైన ఓట్లు సాధించారు. ఎనిమిది రౌండ్లలో ఆయనకు 16,183 ఓట్లు దక్కాయి. మిగిలిన అభ్యర్థులు తక్కువ ఓట్లతో సరిపెట్టుకున్నారు. విజేత పేరాబత్తులకు రిటర్నింగ్ అధికారి వెట్రిసెల్వి ధ్రువీకరణ పత్రం అందించారు.
·˘ 77,461 KrÏ Ððl$gêÈt™ø VðSË$ç³#
·˘ ï³yîlG‹œ A¿ýæÅÇ®MìS 47,241 Kr$Ï
·˘ 8 Æú…yýlÏÌZ Ð]l¬Wíܯ]l KrÏ ÌñæMìSP…ç³#
Comments
Please login to add a commentAdd a comment