హాకీ జట్టు ఎంపిక
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): అంతర్ జిల్లాల హాకీ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టు ఎంపిక స్థానిక జిల్లా క్రీడా మైదానంలో మంగళవారం జరిగింది. జిల్లా హాకీ సంఘం ఆధ్వర్యాన జరిగిన ఈ ఎంపికలకు 25 మంది హాజరయ్యారు. డీఎస్‌ఏ హాకీ కోచ్ నాగేంద్ర పర్యవేక్షణలో 18 మందిని జట్టుకు ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకూ గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో జరిగే అంతర్ జిల్లాల హాకీ పోటీలో పాల్గొంటారు. ఈ జట్టుకు కోచ్‌గా దుర్గాప్రసాద్, మేనేజర్‌గా బాబ్జీ వ్యవహరిస్తారని హాకీ సంఘం ప్రతినిధి రవిరాజు తెలిపారు.
‘మన మిత్ర’ నుంచి
టెన్త్ హాల్ టికెట్లు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను మన మిత్ర వాట్సాప్ (వాట్సాప్ గ్రీవెన్స్) ద్వారా విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 17 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకూ ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకూ ఈ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. సంబంధిత ప్రధానోపాధ్యాయులు మన మిత్ర వాట్సాప్ యాప్ ద్వారా హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేయవచ్చునని తెలిపారు. అభ్యర్థులు తమ వాట్సాప్ ద్వారా 95523 00009 నంబర్‌కు హాయ్ అనే సందేశం పంపించి, సేవ, పదో తరగతి హాల్ టికెట్ ఎంపిక చేసుకోవాలన్నారు. అనంతరం అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేస్తే హాల్ టికెట్ డౌన్‌లోడ్ అవుతుందని డీఈఓ వాసుదేవరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment