అన్ని వర్గాలకూ చంద్రబాబు సర్కార్‌ మోసం | - | Sakshi
Sakshi News home page

అన్ని వర్గాలకూ చంద్రబాబు సర్కార్‌ మోసం

Published Wed, Mar 12 2025 7:57 AM | Last Updated on Wed, Mar 12 2025 7:52 AM

అన్ని

అన్ని వర్గాలకూ చంద్రబాబు సర్కార్‌ మోసం

ఉద్యోగాలు హుళక్కి

ఫ అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలిస్తామని కూటమి పెద్దలు చెప్పడంతో డిగ్రీ, ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన వేలాది మంది డీఎస్సీ, గ్రూప్‌, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌, ఏపీపీఎస్సీ తదితర కొలువుల కోసం వేలాది మంది ప్రయత్నాలు చేస్తున్నారు. వారి భవిష్యత్తు కోసం అయినకాడికి అప్పులు చేసి కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ ఇప్పిస్తున్న తల్లిదండ్రులు కూడా ఎంతో మంది ఉన్నారు. ఉన్నత చదువులు చదివి కుటుంబ ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా అరకొర జీతంపై స్థానికంగా, హైదరాబాద్‌, బెంగళూరు, చైన్నె తదితర ప్రాంతాలకు వలస వెళ్లి ప్రైవేటు సంస్థల్లో పని చేస్తున్న వారి సంఖ్య లక్షన్నర పైనే ఉంది. వీరిలో కూడా మూడు వంతుల మంది తమ చదువుకు తగిన ఉద్యోగం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కానీ, ప్రభుత్వం మాత్రం ఉద్యోగాల భర్తీ హామీని తుంగలో తొక్కేసింది.

ఫ కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు.. ఉన్నవి ఊడబీకేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే వలంటీర్లను కొనసాగించి రూ.5 వేల జీతాన్ని రూ.10 వేలకు పెంచుతామన్నారు. తీరా చూస్తే మొత్తం వ్యవస్థనే లేకుండా చేసేశారు. ఫలితంగా జిల్లాలోని 11,990 మంది వలంటీర్లు రోడ్డున పడ్డారు.

ఫ కూటమి నేతలకు మద్యం షాపులు కట్టబెట్టేందుకు ప్రైవేటు మద్యం పాలసీని కూటమి ప్రభుత్వం తీసుకుని వచ్చింది. దీని ఫలితంగా గత వైఎస్సార్‌ సీపీ హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పని చేసిన సుమారు 1,000 మంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయారు.

ఫ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలివ్వకపోగా అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది, ఫీల్డ్‌ అసిస్టెంట్లను దగా చేశారు.

ఫ ఉద్యోగాలు ఇవ్వలేకుంటే అప్పటి వరకూ 18 నుంచి 35 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న వారికి ప్రతి నెలా నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు చెప్పారు. జిల్లాలో ఈ వయస్సులో ఉన్న యువత 3.15 లక్షల పైనే. వీరికి ప్రతి నెలా రూ.3 వేల చొప్పున రూ.94,50,00,000, తొమ్మిది నెలలకు రూ.850,50,00,000 చెల్లించాల్సి ఉంది. కానీ, 2014లో రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని నమ్మించి, వంచించినట్టుగానే ఇప్పుడు కూడా చంద్రబాబు రూ.3 వేల భృతి హామీని గాల్లో కలిపేశారని నిరుద్యోగులు మండిపడుతున్నారు.

ఫ ఉద్యోగాల భర్తీ లేదు..

నిరుద్యోగ భృతీ లేదు

ఫ 11,990 మంది

వలంటీర్లను రోడ్డున పడేశారు

ఫ పైగా లక్షల

ఉద్యోగాలిచ్చినట్లు బిల్డప్‌లు

ఫ అరకొరగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌

ఫ కూటమి ప్రభుత్వ కుయుక్తులపై

వైఎస్సార్‌ సీపీ ఉద్యమ బాట

ఫ నేడు కాకినాడలో ‘యువత పోరు’

ఉద్యోగాల భర్తీ

నిరుద్యోగ భృతి

కాకినాడ రూరల్‌: హామీలు నెరవేర్చకుండా మహిళలు, రైతులు, విద్యార్థులు, యువత, నిరుద్యోగులు.. ఇలా రాష్ట్రంలోని అన్ని వర్గాలనూ మోసగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీయడానికి వైఎస్సార్‌ సీపీ నిరంతరం సిద్ధంగా ఉంటుందని వైఎస్సార్‌ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్‌ కో ఆర్డినేటర్‌, మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద బుధవారం యువత పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. కాకినాడ రమణయ్యపేట వైద్య నగర్‌లోని కార్యాలయంలో యువత పోరు పోస్టర్‌ను ఆయన మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అంటే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి గుర్తుకొస్తారని, ఆయన తరువాత మొత్తం ఫీజు చెల్లించే ప్రక్రియకు గత సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారని అన్నారు. ఈ రోజు సుమారు రూ.4,600 కోట్ల మేర బకాయి పెట్టి విద్యార్థుల భవిష్యత్తుతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆటాలాడుతున్నారని దుయ్యబట్టారు. కళాశాలల అకౌంట్లలో డబ్బులు వేస్తామని ప్రభుత్వం చెబుతూండగా.. తమకు డబ్బులు రాలేదంటూ విద్యార్థులను యాజమాన్యాలు బెదిరిస్తున్నాయని చెప్పారు. దీంతో, హాల్‌ టికెట్లు ఇస్తారో, లేదోనని, పరీక్ష హాలులో కూర్చోనిస్తారో, లేదోనని విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారన్నారు. చంద్రబాబు మెగా డీఎస్సీ ఫైలుపై తొలి సంతకం చేశారని, ప్రతి నెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారని, ఈ హామీలకు ఇప్పటికీ అతీగతీ లేదని కన్నబాబు విమర్శించారు. అధికారమే చంద్రబాబు పరమాధి అని అన్నారు. గత సీఎం వైఎస్‌ జగన్‌ హయాంలో 17 వైద్య కళాశాలల నిర్మాణం ప్రారంభించగా 5 కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయన్నారు. పూర్తయిన పులివెందుల సహా అన్ని కళాశాలలనూ ప్రైవేటుపరం చేయడానికి చంద్రబాబు కంకణం కట్టుకున్నారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్య, వైద్యం పట్ల ఇంత చులకన దేనికని, పూర్తిగా వ్యాపారంగా మార్చాలని ఎందుకనుకుంటున్నారని ప్రశ్నించారు. పీపీపీ పేరిట రూ.వేల కోట్లతో గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వైద్య కళాశాలలను అస్తవ్యస్తం చేస్తున్నారన్నారు. తమకు మెడికల్‌ సీట్లు వద్దని కేంద్రానికి లేఖ రాసిన తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు ఖ్యాతి దక్కిందని ఎద్దేవా చేశారు. పేదలకు మంచి జరుగుతుందంటే అడ్డుకుంటున్నారన్నారు. అందుకే యువత పోరు పేరిట పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి, కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ పీపీ నాయకులు, కార్యకర్తలు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కన్నబాబు కోరారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకుడు కురసాల సత్యనారాయణ, జెడ్పీటీసీ సభ్యుడు నురుకుర్తి రామకృష్ణ, సర్పంచ్‌లు బెజవాడ సత్యనారాయణ, రామదేవు సూర్యప్రకాశరావు, పార్టీ విద్యార్థి, బీసీ విభాగాల జిల్లా అధ్యక్షులు పూసల అనిల్‌, అల్లి రాజబాబు తదితరులు పాల్గొన్నారు.

ఫ నేడు యువత పోరు

ఫ పోస్టర్‌ ఆవిష్కరించిన వైఎస్సార్‌ సీపీ నేత

కురసాల కన్నబాబు

No comments yet. Be the first to comment!
Add a comment
అన్ని వర్గాలకూ చంద్రబాబు సర్కార్‌ మోసం1
1/1

అన్ని వర్గాలకూ చంద్రబాబు సర్కార్‌ మోసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement