ర్యాంకు పెరిగినా.. పెరగని సంతృప్తి
అన్నవరం: గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అభిప్రాయ సేకరణలో అన్నవరం దేవస్థానానికి సంబంధించి విచిత్రమైన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో జనవరిలో నిర్వహించిన అభిప్రాయ సేకరణ ప్రకారం అన్నవరం దేవస్థానానికి చిట్టచివరిగా ఏడో ర్యాంకు రాగా, గత నెలలో చేపట్టిన అభిప్రాయ సేకరణ ప్రకారం పరిస్థితి మెరుగుపడి, రెండో ర్యాంకు వచ్చింది. అయితే, జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో ఇక్కడ అందిస్తున్న సేవలపై భక్తులో అసంతృప్తి పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. మిగిలిన దేవస్థానాల కన్నా ఇక్కడ తక్కువ అసంతృప్తి ఉండటం ద్వారా అన్నవరం రెండో స్థానంలో నిలిచిందని తెలుస్తోంది.
అభిప్రాయ సేకరణ జరిపారిలా..
ఫ కాణిపాకం, శ్రీకాళహస్తి, ద్వారకా తిరుమల, విజయవాడ కనకదుర్గ గుడి, విశాఖ జిల్లా సింహాచలం, శ్రీశైలం, అన్నవరం దేవస్థానాల్లో భక్తులకు సేవలు, ప్రసాదం నాణ్యత, ఇతర ఏర్పాట్లపై జనవరి 25 – ఫిబ్రవరి 24 తేదీల మధ్య వాట్సాప్, ఐవీఆర్‌ఎస్ ద్వారా అభిప్రాయాలు తెలుసుకుని తాజా ర్యాంకులు ప్రకటించారు.
ఫ సత్యదేవుని సన్నిధిలో ‘దర్శనం మీరు భావించిన సమయంలో జరిగిందా?’ అనే ప్రశ్నకు 70 శాతం మంది అవునని బదులిచ్చారు. 30 శాతం మంది అలా జరగలేదని చెప్పారు. జనవరిలో సంతృప్తి వ్యక్తం చేసిన భక్తులు 78 శాతం మంది ఉండగా ఫిబ్రవరిలో 8 శాతం మంది ఎక్కువగా అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఫ దేవస్థానంలో మౌలిక వసతుల కల్పన, తాగునీరు, వాష్ రూములు, వెయిటింగ్ ఏరియా, రవాణా సౌకర్యాలు, చెప్పులు భద్రపరిచే చోటు తదితర అంశాలపై 65 శాతం భక్తులు సంతృప్తి, 35 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాల్లో అన్నవరం దేవస్థానానికి మూడో ర్యాంకు వచ్చింది. జనవరిలో 67 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. దీంతో పోలిస్తే ఫిబ్రవరిలో ఇది 2 శాతం తగ్గింది.
ఫ సత్యదేవుని ప్రసాదం రుచి, నాణ్యతలో 82.4 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయడం ద్వారా రెండో ర్యాంకు వచ్చింది. జనవరిలో 87 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు.
ఫ మొత్తం మీద దేవస్థానం అందిస్తున్న సేవల్లో ఫిబ్రవరిలో నిర్వహించిన సర్వే ప్రకారం భక్తుల్లో అసంతృప్తి శాతం పెరిగినట్లు తెలుస్తోంది. కనీసం ఈ నెలలోనైనా భక్తుల సంతృప్తి శాతం పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఫ అన్నవరం దేవస్థానానికి
ఫిబ్రవరిలో రెండో ర్యాంకు
ఫ దర్శనం, మౌలిక వసతులు,
ప్రసాదంపై ఇంకా భక్తుల్లో అసంతృప్తి
Comments
Please login to add a commentAdd a comment