మెగా డీఎస్సీపై మొదటి సంతకం ఏమైంది? | - | Sakshi
Sakshi News home page

మెగా డీఎస్సీపై మొదటి సంతకం ఏమైంది?

Mar 23 2025 12:16 AM | Updated on Mar 23 2025 12:14 AM

కూటమి హామీలపై ధ్వజమెత్తిన ఏఐవైఎఫ్‌

అమలాపురం టౌన్‌: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అప్పుడే తొమ్మిడి నెలలు గడస్తున్నా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలు మాటే మరిచిందని ఏఐవైఎఫ్‌ జిల్లా శాఖ అధ్యక్షుడు రెడ్డి సతీష్‌కుమార్‌ ధ్వజమెత్తారు. అమలాపురంలోని ఎస్‌టీయూ జిల్లా కార్యాలయంలో 17వ ఏఐవైఎఫ్‌ జాతీయ మహాసభల లోగోను జిల్లా శాఖ ప్రతినిధులు శనివారం ఆవిష్కరించారు. సతీష్‌కుమార్‌, కార్యదర్శి యనమదల ఉమేష్‌ తదితరులు కూటమి ప్రభుత్వ హామీల వైఫల్యాలను ఎండగట్టారు. మెగా డీఎస్సీ అంటూ అధికారంలోకి వచ్చిన రోజు మొదటి సంతకంగా చేసినా నేటికీ చర్యలు లేవని ఆరోపించారు. నిరుద్యోగ భృతిపై ప్రకటన చేయాలని వారు డిమాండ్‌ చేశారు. జిల్లాలోని ఓఎన్జీసీ వనరులను గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాలకు తరలిస్తున్న పరిణామాలపై ఏఐవైఎఫ్‌ జిల్లా శాఖ ప్రతినిధులు దుయ్యబట్టారు. తిరుపతిలో వచ్చే మే 15వ తేదీ నుంచి ఏఐవైఎఫ్‌ 17వ జాతీయ మహా సభల్లో కూటమి ప్రభుత్వం వైఫల్యాలను చర్చించనున్నట్టు వారు తెలిపారు. జతీయ మహాసభల లోగో ఆవిష్కరణలో ఏఐవైఎఫ్‌ జిల్లా కోశాధికారి యాండ్ర నాగరాజు, జిల్లా శాఖ సభ్యులు నిమ్మకాయల కళ్యాణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement