కన్న పేగు భారమయ్యిందా?!
కామారెడ్డి క్రైం : నవమాసాలు కడుపులో మోసి, కని పెంచిన తల్లి.. వృద్ధాప్యంలో తన సంతానానికి భారమైంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను ధర్మాసుపత్రిలో చేర్చి వదిలించుకుని వెళ్లిపోయారు. వివరాలిలా ఉన్నాయి. మాచారెడ్డి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన గీకురు సాయవ్వ అనే 70 ఏళ్ల వృద్ధురాలికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. పెద్ద కుమారుడు కొన్నేళ్ల క్రితం మరణించాడు. పదేళ్ల క్రితం వారి కుటుంబం కామారెడ్డికి మకాం మార్చింది. ఈనెల 18 న సాయవ్వ కాలు జారి పడిపోవడంతో చేయి విరిగింది. మరుసటి రోజు ఆమెను కూతురు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చేర్పించి వెళ్లిపోయింది. అప్పటినుంచి కూతురు సరోజన, రెండో కుమారుడు వెంకటేశ్, కోడలు రాజేశ్వరిలలో ఎవరూ ఆమె వద్దకు రాలేదు. ఆస్పత్రి వర్గాలు వారికి ఫోన్ చేసినా స్పందించడం లేదని తెలిసింది. అందరూ ఉన్నా అనాథగా మారిన సాయవ్వ బాగోగులను ఆస్పత్రి వైద్య సిబ్బంది, పోలీస్ కానిస్టేబుల్ లక్ష్మణ్‌రావు చూసుకుంటున్నారు. కుమారుడు, కూతురు వచ్చి సాయవ్వను తీసుకువెళ్లాలని కోరుతున్నారు.
అమ్మను ఆస్పత్రిలో వదిలివెళ్లిన కుటుంబ సభ్యులు
ఫోన్ చేసినా స్పందించని వైనం
Comments
Please login to add a commentAdd a comment