
‘రుణాలను రికవరీ చేయాలి’
కామారెడ్డి క్రైం: సీ్త్రనిధి రుణాలను పారదర్శకంగా వసూలు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. ఇందుకోసం పాయింట్ ఆఫ్ సెల్(పాస్) మిషన్లను ఉపయోగించాలన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో మహిళా సమాఖ్య ప్రతినిధులకు పాస్ మిషన్లను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదటిసారిగా పట్టణ ప్రాంతాల్లోని సమాఖ్య సభ్యులకు పాస్ మిషన్‌లను అందిస్తున్నామన్నారు. సీ్త్రనిధికి సంబంధించిన రుణాలు సులభంగా, పారదర్శకంగా, బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పాస్ యంత్రాల ద్వారా వాయిదాలు చెల్లించవచ్చని స్వయం సహాయక సంఘాల సభ్యులకు సూచించారు. కార్యక్రమంలో మెప్మా పీడీ శ్రీధర్‌రెడ్డి, సీ్త్రనిధి రీజినల్ మేనేజర్ కిరణ్ కుమార్, సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment