ప్రతిపాదనలు సిద్ధం చేయండి
కామారెడ్డి క్రైం: సదరం శిబిరాల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు, పరికరాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో వైద్య ఆరోగ్య శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సదరం క్యాంపుల నిర్వహణకు వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్‌డీవో సురేందర్, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఫరీదా బేగం, జిల్లా ఆస్పత్రి కోఆర్డినేటర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment