‘మోడల్’ నిర్మాణాలు పూర్తి చేయాలి
కామారెడ్డి క్రైం: మోడల్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మండలంలో ఇందిరమ్మ మోడల్ ఇళ్ల నిర్మాణాలను వెంటనే పూర్తిచేయాలన్నారు. ప్రతి మండలానికి ఇద్దరు చొప్పున ఇళ్ల నిర్మాణాలు చేపట్టే మేసీ్త్రలకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఇసుక, సిమెంట్, ఇతర ముడిసరుకులను సమకూర్చాలన్నారు. ఇటుక తయారీ కోసం స్వయం సహాయక సంఘాలను గుర్తించి యూనిట్లు మంజూరు చేయాలని సూచించారు. నిరుపేదలకు ప్రాధాన్యత కల్పిస్తూ నిర్మాణాలకు సిద్ధంగా ఉన్న వారికి అనుమతించాలన్నారు. కొత్త మండలాల్లో మోడల్ ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన స్థలాలను గుర్తించాలన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, జెడ్పీ సీఈవో చందర్, డీఆర్‌డీవో సురేందర్, గృహనిర్మాణ శాఖ ఈఈ విజయపాల్‌రెడ్డి, ఇతర ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
మేసీ్త్రలకు శిక్షణ ఇప్పించండి
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Comments
Please login to add a commentAdd a comment