ఉన్నత విద్యాసంస్థలు నెలకొల్పాలి
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జుక్కల్ నియోజకవర్గంలో ఉన్నత విద్యాసంస్థలు నెలకొల్పి, ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డిని కోరారు. బుధవారం ఆయన జుక్కల్ నియోజకవర్గానికి చెందిన సామాజిక కార్యకర్త జ్యోతిర్మయరెడ్డితో కలిసి బాలకిష్టారెడ్డితో సమావేశమయ్యారు. నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద ఫిషరీష్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్, ఆగ్రో బేస్డ్ టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌లు, స్పోర్ట్స్ అకాడమీలు ఏర్పాటు చేయాలని కోరారు. తమ వినతులపై ఉన్నత విద్యామండలి చైర్మన్ సానుకూలంగా స్పందించారని జ్యోతిర్మయరెడ్డి ‘సాక్షి’తో తెలిపారు.
లోక్ అదాలత్‌ను
సద్వినియోగం చేసుకోవాలి
కామారెడ్డి క్రైం: జిల్లాలోని అన్ని కోర్టులలో ఈనెల 8 న నిర్వహించే జాతీయ మెగా లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సింధు శర్మ బుధవారం ఒక ప్రకటన ద్వారా సూచించారు. రెండు నెలలకొకసారి నిర్వహించే లోక్‌అదాలత్‌లో రాజీ కుదుర్చుకోదగిన అన్ని రకాల కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కేసులను సత్వరమే పరిష్కరించుకునే అవకాశం లోక్ అదాలత్‌లో ఉంటుందని తెలిపారు. ఆయా కేసుల్లో కక్షిదారులుగా ఉన్న వారికి అవగాహన కల్పించి జాతీయ లోక్ అదాలత్‌లో వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
పని చేయని
ఎల్‌ఆర్‌ఎస్ వెబ్‌సైట్
కామారెడ్డి టౌన్: మున్సిపల్ ఎల్‌ఆర్‌ఎస్ వెబ్‌సైట్ రెండు రోజులుగా పని చేయడం లేదు. దీంతో దరఖాస్తుదారులు ఇబ్బందిపడుతున్నారు. 25 శాతం ఫీజు రాయితీతో ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ఈనెల 31 వరకు అవకాశం ఉంది. ఫీజు చెల్లించి ఎల్‌ఆర్‌ఎస్ చేయించుకోవాలని ఆధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం కొందరు దరఖాస్తుదారులు తమ ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం కామారెడ్డి బల్దియాకు రాగా వెబ్‌సైట్ పని చేయలేదు. దీంతో వారు అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయమై టీపీవో గిరిధర్‌ను వివరణ కోరగా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేస్తుండడంతో వైబ్‌సైట్ పని చేయడం లేదన్నారు. రెండు రోజుల్లో సైట్ ఓపెన్ అవుతుందని తెలిపారు. ప్రస్తుతం వెబ్‌సైట్‌తో సంబంధం లేకుండా దరఖాస్తుదారులు 25 శాతం రాయితీతో ఫీజు కట్టాలని, తర్వాత క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి అనుమతులు ఇస్తామని పేర్కొన్నారు.
రెండు రోజులు
ఫ్లెక్సీ దుకాణాల మూసివేత
కామారెడ్డి టౌన్: జిల్లాకేంద్రంలోని ఫ్లెక్సీ దుకాణాలను ఈనెల 8, 9 తేదీలలో మూసి ఉంచనున్నట్లు కామారెడ్డి ఫ్లెక్సీ అసోసియేషన్ ప్రతినిధులు ప్రవీణ్, భాను బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఫ్లెక్సీ కలర్స్, మెటీరియల్స్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.
శాసీ్త్రయ దృక్పథాన్ని
పెంపొందించుకోవాలి
గాంధారి: విద్యార్థులు శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని, భావి భారత శాస్త్రవేత్తలుగా ఎదగాలని డీఈవో రాజు సూచించారు. పోతంగల్ కలాన్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన కాంప్లెక్స్ స్థాయి టీచింగ్ లర్నింగ్ మెటీరియల్(టీఎల్‌ఎం) మేళాకు ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి రోజు పాఠశాలకు రావాలని విద్యార్థులకు సూచించారు. తెలియని విషయాలు ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలన్నారు. సైన్స్ ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రయోగాల ద్వారా పాఠాలపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం రంగారావు తదితరులు పాల్గొన్నారు.
ఉన్నత విద్యాసంస్థలు నెలకొల్పాలి
Comments
Please login to add a commentAdd a comment