చివరి ఆయకట్టు వరకు నీరందించాలి
రెంజల్: చివరి ఆయకట్టు వరకు సాగు నీరందించేందుకు చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ఇరిగేషన్ అధికారులకు సూచించారు. ఆదివారం రెంజల్ మండలంలోని తాడ్‌బిలోలి, బోర్గాం, రెంజల్ గ్రామాలను సందర్శించి రైతులతో సాగు నీటి అవసరాలపై ముచ్చటించారు. అలీసాగర్ ద్వారా విడుదల చేస్తున్న నీటిని వృథా చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పంటలు ఎండకుండా నీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు న్యాయం జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటూ, కాల్వలపై పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఆయా గ్రామాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రైతులు సుదర్శన్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బోర్గాం రైతులకు కందకుర్తి ఎత్తిపోతల ద్వారా నీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మండలంలోనే చక్కెర ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని తెలిపారు. రైతులు చెరుకు పంట సాగుకు ముందుకు రావాలని సూచించారు.
ఎన్నికల్లో సమర్థులను ఎన్నుకోవాలి
స్థానిక సంస్థలకు నిర్వహించే ఎన్నికల్లో సమర్థులెన వారినే ఎన్నుకునాలని ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి రైతులకు సూచించారు. వారిచ్చే డబ్బులకు ఆశపడితే గ్రామాల అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. అనంతరం తాడ్‌బిలోలిలో బాధిత కుటుంబానికి రూ. 2.50 లక్షల ఎల్‌వోసీని అందజేశారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, పార్టీ మండల అధ్యక్షుడు మొబిన్‌ఖాన్, నాగభూషణంరెడ్డి, సాయారెడ్డి, మొయినొద్దీన్, సాయిబాబాగౌడ్, జావీద్, నితిన్, మర్ల రమేశ్, కుర్మె శ్రీనివాస్, కిరణ్, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.
పంట భూములకు నీరందిస్తాం
నవీపేట: నిజాంసాగర్ చివరి ఆయకట్టు భూముల కు పుష్కలంగా సాగు నీరందిస్తామని బోధన్ ఎమ్మె ల్యే సుదర్శన్‌రెడ్డి అన్నారు. నవీపేట, జన్నెపల్లి శివారులోని పంట భూములను పరిశీలించారు. వి డతల వారీగా వస్తున్న అలీసాగర్ ఎత్తి పోతల నీటి ని పంట భూములకు వాడుకోవాలని సూచించారు. ఆయన వెంట నాయకులు శ్రీనివాస్‌గౌడ్, మహిపాల్‌రెడ్డి, సాయారెడ్డి, భగవాన్, గోపాల్, సంజీవ్‌రెడ్డి, సురేశ్, గౌరురాజు తదితరులు ఉన్నారు.
మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment