రాష్ట్రస్థాయి బేస్‌బాల్ పోటీల్లో జిల్లా జట్టు ప్రతిభ
నిజామాబాద్‌నాగారం: రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్ బేస్‌బాల్ పోటీల్లో జిల్లా బాలికల జట్టు ప్రథమ స్థానంలో నిలువగా, బాలుర జట్టు తృతీయస్థానంలో నిలిచింది. ఫిబ్రవరి 28 నుంచి ఈ నెల 2 వరకు సిద్దిపేట జిల్లాలో నిర్వహించిన పోటీల్లో జిల్లా బాలికల జట్టు ప్రథమ స్థానంలో, బాలుర జట్టు తృతీయ స్థానంలో గెలుపొందినట్లు అసోసియేషన్ అధ్యక్షుడు ఎల్ మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సొప్పరి వినోద్ తెలిపారు. కార్యక్రమంలో నిర్వాహకులు విజేత జట్లకు ట్రోఫీలను అందజేశారు. జట్లకు కోచ్ మేనేజర్లుగా నరేశ్, అనికేత్, సంతోష్, సాయి కుమార్ వ్యవహరించారు.
రాష్ట్రస్థాయి బేస్‌బాల్ పోటీల్లో జిల్లా జట్టు ప్రతిభ
Comments
Please login to add a commentAdd a comment