దుద్దిళ్ల శ్రీపాదరావు సేవలు మరువలేనివి
ఖలీల్‌వాడి: మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు సేవలు మరువలేనివని అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కమిషనరేట్ కార్యాలయంలో ఆయన జయంతి కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి అదనపు డీసీపీ పూలమాల వేసి నివాళులు అర్పించారు. 1999లో మహదేవపూర్ మండలం అన్నారంలో నక్సలైట్లు ఆయనను హత్య చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటన నాడు రాష్ట్రాన్ని కుదిపేసిందన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ(ఏఆర్) రాంచందర్ రావు, ఆఫీస్ సూపరింటెండెంట్ శంకర్, ఆర్‌ఐ(వెల్ఫేర్) శ్రీనివాస్, పోలీస్ కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.
జోరుగా ఇసుక దందా
రాజంపేట: రాజంపేట మండలంలో ఇసుక దందా జోరుగా సాగుతోంది. అడ్డుకోవాల్సిన అధికారులు ఇటు వైపు చూడకపోవడంతో వీరు ఆడిందే ఆటగా సాగుతోంది. రాత్రి వేళల్లో, ప్రభుత్వ సెలవుదినాల్లో దళారులు జోరుగా ఇసుక ఇతర ప్రాంతాలకు తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కోడుతున్నారు. మండల కేంద్రంలోని గుండారం చుట్టు పక్కల ఉన్న నడిమి తండాతో ఇతర తండా వాసులు ఇసుక అక్రమ రవాణాను కొనసాగిస్తున్నారు. రెవెన్యూ, అటవీ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే ఇసుక దళారులు తమ దందాను జోరుగా సాగిస్తున్నారు. కొందరు ఇంటి పరిసర ప్రాంతాల్లో డంపు చేసుకొని అనంతరం టిప్పర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరిలిస్తున్నారు. ఇంతలా జరుగుతున్నా అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. అధికారులు ఇసుక దళారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. ఇకనైనా సంబందిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
జాతీయ స్థాయి
హాకీ పోటీలకు ఎంపిక
సిరికొండ: జాతీయ స్థాయి హకీ పోటీలకు తూంపల్లి క్రీడాకారిణి మాలావత్ మమత ఎంపికై నట్లు జెడ్పీహెచ్‌ఎస్ పీడీ నగేష్ తెలిపారు. గత నెలలో జింఖానా గ్రౌండ్స్‌లో నిర్వహించిన సీనియర్ నేషనల్స్ ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ందన్నారు. జాతీయ స్థాయి పోటీలు ఈ నెల 10 వరకు హర్యానాలో జరుగుతాయని ఆయన తెలిపారు. సాయ్ అకాడమీలో శిక్షణ పొందుతున్న మమత జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవ్వడంపై జిల్లా హకీ అసోసియేషన్ అధ్యక్షుడు విశాఖ గంగారెడ్డి, కార్యదర్శి రమణ, వీడీసీ, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment